టాప్ 10 తెలుగు సినిమాలు 2018

టాప్ 10 తెలుగు సినిమాలు 2018

టాప్ 10 తెలుగు సినిమాలు 2018


2018 సంవత్సరానికి గాను తెలుగులో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో టాప్ టెన్ సినిమాలను ఇక్కడ మీకోసం ప్రత్యేకంగా ఇస్తున్నాం.

1. C/O కంచరపాలెం.


అందరూ కొత్తవాళ్లతో తీసిన ఈ సినిమా రిలీజ్ కు ముందు నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇకపోతే హీరో రానా ఈ సినిమా ని టేకప్ చేసిన తర్వాత ఈ సినిమా గురించి బాగా ప్రచారం జరిగింది. ఈ సినిమాని దర్శకుడు చాలా రియల్ లొకేషన్స్ లో కంచరపాలెం అనే ఊర్లో ఉన్న నిజమైన ప్రజలతో సినిమా తీశారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా అద్భుతంగా ఉందని సినిమాలో వివిధ పాత్రల లో నటించిన నటుల నటన గొప్పగా ఉందని పొగిడారు. ఈ చిత్ర దర్శకుడు వెంకటేష్ మహా కు ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.

అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా ఒక స్పై థ్రిల్లర్ గా వచ్చింది. సినిమా కథతో పాటు స్క్రీన్ ప్లే  అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ, విజువల్స్ సినిమాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. తెలుగులో రొటీన్ గా మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు వస్తున్న తరుణంలో అడవి శేష్ చేసిన ఈ ప్రయోగానికి జనాల నుంచి మంచి స్పందన లభించింది.

3. మహానటిఅలనాటి మహానటి సావిత్రి జీవిత కథగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పటి పరిస్థితులను నటి సావిత్రి జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించగలిగింది. సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్ ఆమె పాత్రలో ఒదిగిపోయింది సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ సావిత్రి పాత్రతో పాటు సినిమాలో ఉన్న మిగతా పాత్రలను  కూడా అద్భుతంగా చూపించగలిగారు. ఈ సినిమాకు ఆ పాత తరం నుంచి ఈ తరం వరకు అన్ని వర్గాల ప్రజల నుంచి చాలా గొప్ప ఆదరణ లభించింది.

4. రంగస్థలంమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1980 బ్యాక్ డ్రాప్ తో రాంచరణ్ చెవిటివాడు గా సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. దేవీశ్రీ  ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ సంవత్సరం లోనే అతి పెద్ద మ్యూజికల్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

న్యాచురల్ స్టార్ నాని తొలిసారి నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని తీశారు. కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంచుకున్న కథ కథనాలు ఆడియన్స్ ని మంత్రముగ్ధుల్ని చేశాయి. కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమాలో నిత్యామీనన్, రెజీనా ఈషా రెబ్బ లాంటి ప్రముఖ హీరోయిన్లు కూడా నటించారు.

6. భరత్ అనే నేనుసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారి ముఖ్యమంత్రి పాత్రలో నటించారు. భారీ అంచనాల నడుమ బాక్సాఫీస్ వద్ద రిలీజైన ఈ సినిమా జనాలను ఆకట్టుకు కోవడంలో విజయవంతమైందని చెప్పాలి.

7.గీత గోవిందం
యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రశ్మిక హీరో హీరోయిన్ లు గా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద చాలా పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. రొమాంటిక్ కామెడీగా వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇంకేం ఇంకేం కావాలి అనే పాట ఈ సంవత్సరానికి అతి పెద్ద హిట్ సాంగ్ గా నిలిచింది.

8. నీది నాది ఒకే కథశ్రీ విష్ణు హీరోగా నూతన దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. టెక్నాలజీ పరంగా ఎంత గా ఎదిగినప్పటికీ మనిషి తన జీవితాన్ని
కోల్పోతున్నాడని ఒక మిషన్ లా మారిపోతున్నాడు అని ఈ సినిమాలో చూపించారు.

9. తొలిప్రేమమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి లవ్ స్టోరీ గా నిలిచింది.రాశికన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి తమన్ అందించిన స్వరాలు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రోబో చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.ఈ సినిమాలో విలన్ పాత్రలో పక్షిరాజు గా ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించారు. బాహుబలి సినిమా తర్వాత అంతటి భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో సఫలీకృతమైంది.

Post a comment

0 Comments