ఠాగూర్ కు సీక్వెల్??

ఠాగూర్ కు సీక్వెల్??

ఠాగూర్ కు సీక్వెల్??


భరత్ అనే నేను సినిమా తరవాత మెగాస్టార్ చిరంజీవి తో తన నెక్స్ట్ సినిమా చేసే అదృష్టాన్ని దక్కించుకున్న టాప్ డైరెక్టర్ కొరటాల శివ ఆయనతో చేసే సినిమా మాములుగా ఉండకూడదు అని ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట అయితే కథ విషయంలో చిరంజీవి కి కొరటాల శివ కి కొంచం అసంతృప్తి ఉండడం తో ఠాగూర్  సినిమాకు సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చిందట.

అనుకున్నది తడవుగా ఇప్పుడు ఠాగూర్  సినిమాకు సీక్వెల్ కోసం కథ రాసే పనిలో కొరటాల ఉన్నారట. చాలా సంవత్సరాల కిందట రిలీజ్ అయిన ఆ సినిమా చిరంజీవి కెరీర్లోనే పెద్ద హిట్ గా నిలిచింది అప్పుడు ఆ సినిమాలో ఆయన డాన్సులు, ఫైట్స్ ఒక సెన్సేషన్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే పదం క్షమించడం అని మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఆ పవర్ ఫుల్ డైలాగు ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.రాజకీయంగా మెగాస్టార్ చిరంజీవి సైలెంట్ గా ఉన్నప్పటికీ తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తో ప్రత్యక్ష రాజకీయాలలో ఉండడం ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ కూడా దగ్గరలోనే ఉండడంతో ఒక మంచి పవర్ ఫుల్ మెసేజ్ తో పొలిటికల్ సినిమా చేస్తే అటు అన్నకు ఇటు తమ్ముడికి అన్నీ విధాలుగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారట.

Post a comment

0 Comments