సన్నీలియోన్ కంటే హాట్ అంట!!!

సన్నీలియోన్ కంటే హాట్ అంట!!!

సన్నీలియోన్ కంటే హాట్ అంట   !!!
ఏ రోజయితే బిగ్ బాస్ టీవీ షోతో  సన్నీలియోన్ ఇండియాకు పూర్తిస్థాయిలో పరిచయం అయ్యిందో అప్పటి నుంచి గూగుల్ సెర్చ్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతూ వచ్చింది. ప్రతి సంవత్సరo గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ అవుతున్న కీ వర్డ్ మీద  విడుదల అయ్యే స్టాటిస్టిక్స్ లో సన్నీలియోన్ తొలి స్థానంలో నిలుస్తూ వచ్చింది.

ఈ విషయంలో సన్నీ లియోన్ ను బీట్ చేసే సెలబ్రిటీలు కానీ, సన్నీలియోన్ కన్నా ఎక్కువ సెర్చ్ అయ్యే మరో సబ్జెక్ట్ కానీ ఇండియాలో లేకుండా పోయింది. ఆ మాటకొస్తే  2016, 2017 సంవత్సరాల గూగల్ సెర్చ్ కీ వర్డ్స్ లో కూడా సన్నీ లియోనే ఇండియాలో టాప్ పొజిషన్ ను ఆక్రమించింది.

సన్నీ లియోన్ కొత్తగా పరిచయం అయినప్పుడూ ఆమెనే టాప్ పొజిషన్లో నిలిచింది, గత ఏడాదిలో కూడా తనే టాప్ లో నిలిచింది. అయితే సన్నీ లియోన్ కు ఈసారి మాత్రం అంత సినిమా లేకుండా పోయింది. దానికి కారణం ఒక మలయాళీ సినిమా టీజర్ తో ఫేమస్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్. ఈ సంవత్సరం అత్యధిక స్థాయిలో గూగుల్ లో జనాలు  సెర్చ్ చేయబడ్డ సెలబ్రిటీగా ఈ పిల్లే టాప్ పొజిషన్ లో  నిలిచింది.ఈ ఏడాదిలో భారతీయులు ఈ అమ్మడి గురించే  అత్యధికంగా సెర్చ్ చేశారు. పోయిన ఏడాది వరకూ సన్నీలియోన్ వరసగా సొంతం చేసుకొంటూ వస్తున్న టాప్ పొజిషన్ ను ఇప్పుడీ కుర్ర మలయాళీ అమ్మాయి సొంతం చేసుకుంది. అలా ఒకసారి కన్ను కొట్టి ఇలా మొత్తం ఇండియన్స్ ను పడేసింది ప్రియా ప్రకాష్ వారియర్.

Post a comment

0 Comments