ఈ సంవత్సరం చరణ్ దే!!!

ఈ సంవత్సరం చరణ్ దే!!!

ఈ సంవత్సరం చరణ్ దే!!!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 2018 సంవత్సరానికి చేసింది కేవలం ఒకే ఒక్క సినిమా అది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం. ఈ సినిమా లో చిట్టిబాబు పాత్రలో నటించిన రామ్ చరణ్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ఈ సినిమాతోనే కొట్టాడు. ఈ సినిమాలో చరణ్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అఖండమైన ఆదరణ లభించింది. ఈ సంవత్సరంలో గీత గోవిందం, మహానటి లాంటి మిగతా బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నప్పటికీ రాంచరణ్ రంగస్థలం సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు.  ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా జగపతిబాబు ప్రతినాయకుడి పాత్ర పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా పాటలు అన్ని వర్గాల వారిని అలరించాయి. రామ్ చరణ్ కు అన్నయ్య గా  హీరో ఆది పినిశెట్టి నటించారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న రామ్ చరణ్ కి నిజమైన సినిమా పడితే అది ఏ రేంజ్ లో ఉంటుందో రంగస్థలం సినిమా చూపించింది.గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేని దర్శకుడు సుకుమార్ కి కూడా ఈ సినిమా భారీ విజయాన్ని ఇచ్చింది. ఎప్పుడు ఇంటిలిజెంట్ సినిమాలు మైండ్ గేమ్ లు అంటూ తన కథల తో ప్రేక్షకులను కన్ఫ్యూస్ చేసే సుకుమార్ కూడా ఈసారి చాలా స్పష్టంగా ఒక గ్రామీణ కథను తీసుకొని చెప్పడం విశేషం.


ఇకపోతే రామ్ చరణ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఈ సినిమా సక్సెస్ ఫంక్షన్ లో ఈ సినిమాని హీరో రామ్ చరణ్ ని ఆకాశానికి ఎత్తేశారు.  రంగస్థలం సినిమా నీ  ఆస్కార్ స్కాా అవార్డు కోసం కూడా పంపించాల్సిన అవసరం ఉందని మాట్లాడారు. ఈ సినిమా కలెక్షన్లు కూడా అటు అమెరికా నుంచి ఇటు అనకాపల్లి వరకు దుమ్ములేపాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాహుబలి రికార్డులను పక్కనపెడితే రంగస్థలం సినిమా క్రియేట్ చేసిన రికార్డులు చాలా భారీగానే ఉన్నాయి. విడుదలైన మొదటి రోజు నుంచే అన్ని వర్గాల నుంచీ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాత అప్రతిహతంగా ముందుకు దూసుకు వెళ్లి పోయింది.ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోకి సహాయం హిట్ పడితే ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో ఆ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటుంది ఎలా ఉంటాయో బాక్సాఫీస్ ఏ రేంజ్లో కళకళలాడుతుంది ఈ సినిమా అందరికీ ప్రత్యక్షంగా చూపించింది. తనకంటే ముందు తన తర్వాత వచ్చిన  హీరోలందరూ బ్లాక్ బస్టర్ హిట్లతో ముందుకెళుతుంటే మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన రాంచరణ్ సరైన హిట్లు లేక కెరీర్లో చాలా ఒడిదుడుకులని ఎదుర్కుంటూ వచ్చాడు అయితే తాను సుకుమార్ దర్శకత్వంలో మొట్టమొదటిసారి చేసిన రంగస్థలం చరణ్ కి చరణ్ అభిమానులకు ఉన్న బాధని ఒక్క సినిమా పోయేలా చేసింది.

Post a comment

0 Comments