నింగికేగిన దర్శక దిగ్గజం మృణాల్ సేన్

నింగికేగిన దర్శక దిగ్గజం మృణాల్ సేన్

నింగికేగిన  దర్శక దిగ్గజం మృణాల్ సేన్


సుప్రసిద్ధ బెంగాలీ దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే పద్మభూషణ్ లాంటి ఎన్నో గొప్ప అవార్డు ల గ్రహీత భారతీయ చిత్ర పరిశ్రమకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన ప్రముఖ బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ వయో భారంతో గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటు ఆదివారం కొల్ కతా లోని తన నివాసంలో కన్ను మూశారు. ఆయన భార్య నటి గీతా సేన్ గతేడాది మరణించారు. ఆయన కుమారుడు కునాల్ సేన్ కూడా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.జననం, సినీ ప్రస్థానం:

మృణాల్ సేన్ గారు 1923 మే 14న ఫరిదాబాద్ లో (ప్రస్తుతం బంగ్లాదేశ్) లో జన్మించారు. కలకత్తా లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఆయన కమ్యూనిస్టు పార్టీ లో సాంస్కృతిక కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొనేవారు అలాగే ఇండియన్ పీపుల్స్ థియే తెర్ అసోసియేషన్ లో పని చేయడం వల్ల అప్పటి సామాజిక రాజకీయ పరిస్థతులపై లోతైన అవగాహన, స్పష్టమైన దృక్పథం ఏర్పడ్డాయి. ఆ తర్వాత కొన్ని  సంవత్స రాలు మెడికల్ రెప్ గా, జర్నలిస్ట్ గాను  పనిచేశారు. అనంతరం కోలకతా లోనే ఒక సినిమా స్టూడియో లోనే ఆడియో విభాగం లో టెక్నీషియన్ గా చేరారు. అక్కడే పని చేయడం వలన ఆయనకు సినిమా రంగం మీద ఆసక్తి కలిగింది. అలా సినిమా రంగం మీద ఆయనకు ఒక అవగాహన కలిగిన తర్వాత 1956 లో మృణల్ సేన్ మొట్ట మొదటగా "రాత్ భోరే" అనే సినిమా తో దర్శకుడిగా మారారు. తన సినిమాల్లో సామాన్య ప్రజల కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు సమాజంలో జరిగే వాస్తవిక సంఘటనలే ఆయన సినిమాల కథా వస్తువులు అలా సినిమా లు తీస్తున్నప్పుడు ఆయనకు కొన్నిసార్లు ఇబ్బందులు కూడా వచ్చాయి. ఆ Tarawa మృణాల్ సేన్ "నీల్ ఆకాషర్ అనే సినిమా తీశారు అయితే దానిని భారత ప్రభుత్వం నిషేధించింది. అప్పటి వరకు ఒక సినిమాను నిషేధించడం అదే ప్రథమం.


మృణాల్ సేన్  మరపురాని చిత్రాలు:

"భైషే శ్రావణ" ఇది ఆయన  మూడో సినిమా ఈ సినిమాతోనే ఆయన ప్రతిభ ప్రపంచానికి తెలిసింది.
1940 లో బెంగాల్ లో వచ్చిన దుర్భిక్ష పరిస్థితులు వివాహ వ్యవస్థలో నైతిక విలువలను ఎలా పతనం చేసిందనే విషయాన్ని ఈ సినిమాలో ఆయన కళ్ళకు కట్టినట్టు చూపించారు. 1969 లో ఆయన తీసిన "భువన్ షోమ్" తో భారతీయ సినీ చరిత్రలోనే చెరిగి పోని ముద్ర వేశారు. పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలను సామాన్యుడి జీవితాన్ని అత్యద్భతంగా చూపించారు. ఈ సినిమాకు ఆయన పడ్డ కష్టానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు విభాగాల్లో జాతీయ అవార్డ్ లు దక్కాయి. ఆయన కెరీర్లో ఇంకా ఏక్ దిన్ అచానక్ , పడాటిక్, మృగాయా'  లాంటి చిత్రాలతో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన నిర్మాతగానూ కొన్ని చిత్రాలను రూపొందించారు. లఘు చిత్రాలను డాక్యుమెంటరీ లను కూడా తెరకెక్కించారు.

అంతర్జాతీయ గుర్తింపు:
మృణాల్ తెరకెక్కించిన పలు బెంగాలీ హిందీ చిత్రాలు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు పురస్కారాలు అందుకున్నాయి. ఆయన కరీజ్ చిత్రం కేన్స్, వెనిస్, బెర్లిన్ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై పురస్కారాలు కైవసం చేసుకుంది. ఆయన తెలుగు లోనూ మన ఊరి కథ అనే సినిమా తీశారు. మృణాల్ సేన్ మృతికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాంటి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Post a comment

0 Comments