నక్సలైట్ గా రానున్న సాయి పల్లవి!!

నక్సలైట్ గా రానున్న సాయి పల్లవి!!


మలర్ అంటూ మలయాళం సినిమా ప్రేమమ్ తో యువ హృదయాలను కొల్ల గొట్టిన ముద్దుగుమ్మ సాయి పల్లవి అంటే యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు ఆ భామ తెలుగు లో ఫిదా సినిమాతో పరిచయమై ఇక్కడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇక పోతే తమిళ్ లో కూడా సూర్య, ధనుష్ వంటి స్టార్ హీరోలతో పెద్ద సినిమాల్లో నటిస్తుంది.

స్వతహాగా డాన్సర్ అయిన సాయి పల్లవి అటు పాటల్లో కూడా రఫ్ ఆడించగలదు. అయితే ఈ భామ తెలుగులో నాని తో చేసిన MCA సినిమా తర్వాత మరే సినిమా ఒప్పుకోలేదు.కానీ రీసెంట్ గా ఒక సినిమాకు ఒకే చెప్పింది అది దగ్గుబాటి రానా నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న సినిమా, అయితే సాయి పల్లవి తన సినిమాల ఎంపికలో చాలా సెలెక్టివ్ గా ఉంటుంది మరి అలాంటిది సడన్ గా ఈ సినిమా ఎందుకు ఒప్పుకుంది అని అందరిలోనూ ఒక సందేహం మొదలైంది అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో సాయి పల్లవి ది ఒక నక్సలైట్ పాత్ర ఆట ఇంకేం ఆమె నటనకు ప్రేక్షకులకు కావాలిసినంత కొత్త దనం అందుకే కాబోలు సాయి పల్లవి కథ విన్న మరు క్షణమే ఈ సినిమాకు ఓకే చెప్పిందట.


తాను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో హీరోలను డామినేట్ చేసింది అన్న పేరు తెచ్చుకున్న సాయి పల్లవి మరి ఈ సినిమాలో భళ్లాల దేవుడు అదేనండి మన రానా ని ఎంత మేరకు డామినేట్ చేస్తుందో చూడాలి.

Post a comment

0 Comments