అడివి శేషు ఎమర్జింగ్ స్టార్ అఫ్ ది ఇయర్

అడివి శేషు ఎమర్జింగ్ స్టార్ అఫ్ ది ఇయర్అడవి శేషు వినాయకుడు సినిమా డైరెక్టర్ అడవి సాయికిరణ్ తమ్ముడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ తనకంటూ ఒక సొంత గుర్తింపును తెచ్చుకున్నాడు అడివి శేష్. కర్మ అనే సినిమాలో నటిస్తూ దర్శకత్వం వహించి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ యువ హీరో ఈ సంవత్సరం గూడచారి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అసలే మూస ధోరణిలో మూస సినిమాలతో నడుస్తున్న తెలుగు సినిమాకి గూడచారి సినిమాతో కొత్త రూపును తీసుకొచ్చాడని చెప్పాలి. ముందు సినిమా ట్రైలర్ తోటి ప్రేక్షకులను ఆకట్టుకున్న అడివి శేషు సినిమా రిలీజ్ అయ్యాక దానిలో ఉన్న కథాకథనాలు టెక్నికల్ బ్రిలియన్స్, విజువల్స్ తో తెలుగు ప్రేక్షకులకు దాదాపుగా ఒక హాలీవుడ్ సినిమానే చూపించగలిగాడు.

ఇండస్ట్రీలో ఏ హీరో అయినా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావాలని కోరుకుంటాడు. ఆ విధంగా చూసుకుంటే అడివి శేష్ కు ఇప్పటికే ఆ గుర్తింపు వచ్చేసినట్టే అనుకోవాలి. మిగతా యువ హీరోలు లాగా లవ్ స్టోరీ లు, కుటుంబ కథా చిత్రాలు, కామెడీ సినిమాలు ఇలాంటివి చేయకుండా ఎప్పుడైతే అడవి శేష్ కొత్తగా ప్రయత్నించాలని గూడచారి సినిమా చేశాడో అప్పుడే తాను నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా అభిరుచులని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్డేట్ అవుతూ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటి వాటి మోజు లోకి వెళ్లి పోతున్న అర్బన్ ఆడియన్స్ ని గూడచారి సినిమాతో ఒక్కసారిగా తన వైపుకి మలుచుకో గలిగాడు దాని ఫలితమే గూడచారి సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవడం. గూడచారి సినిమాకి సీక్వెల్ తీస్తానని ప్రకటించిన అడవి శేషు నెక్స్ట్ ఇయర్ గూడచారి2 తో మన ముందుకు రాబోతున్నాడు. తన బలం ఏంటో తెలుసుకున్న ఈ యువ హీరో ఇలాగే కొత్త దారిలోనే వెళుతూ తెలుగు సినిమా ప్రేక్షకులకు మరిన్ని కొత్త చిత్రాలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

Post a comment

0 Comments