టెంపర్ హిందీ రీమేక్ ఎలా ఉందో తెలుసా??

టెంపర్ హిందీ రీమేక్ ఎలా ఉందో తెలుసా??

టెంపర్ హిందీ రీమేక్ ఎలా ఉందో తెలుసా??జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగులో వచ్చిన సినిమా టెంపర్. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది. ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్   గా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాను హిందీలో రణ్వీర్ సింగ్  ా హీరో గా సింబా పేరుతో రీమేక్ చేశారు. మాస్ మసాలా సినిమాలు బాగా తీస్తాడనే పేరున్న  రోహిత్ శెట్టి చిత్రానికి దర్శకత్వం వహించారు.  అయితే ఈ రోజు విడుదలైన  సినిమాకు ప్రేక్షకుల దగ్గరనుంచి క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా మిశ్రమ స్పందన వచ్చింది.

సినిమాల్లో రన్వీర్ సింగ్ నటన కొంచెం ఎక్కువైందని మరి కమర్షియల్ మాస్ మసాలాలు బాగా దట్టించి వేశారని దీని మాతృక లో ఉన్నంత ఒరిజినాలిటీ సినిమాలో ఎక్కడా కనిపించలేదని రిపోర్ట్స్ వచ్చాయి. అయితే రణ్వీర్సింగ్ ఎనర్జీ అతని నటన రోహిత్ శెట్టి దర్శకత్వం బాగుందని రిపోర్ట్స్ కూడా వచ్చాయి.ఫస్టాఫ్ అంతా హీరో ఇంట్రడక్షన్ హీరో పాత్రలో ఎలివేట్ చేయడం మాస్ మసాలా అంశాలు బాగా చూపించడంతోనే  సరి పెట్టారని కానీ సెకండాఫ్ లాస్ట్ నలభై నిమినిమషాల మాత్రం సినిమా బాగా గ్రిప్పింగ్ గా ఉందని అంటున్నారు.

Post a comment

0 Comments