ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్!!!

ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్!!!

ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్!!!
                                                      image credited from google.com

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తన సొంత రాష్ట్రమైన కర్ణాటక నుంచి పార్లమెంట్ మెంబర్ గా పోటీ చేయబోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ  రాజకీయాల గురించి తన అభిప్రాయాలను వెలిబుచ్చుతూ ముఖ్యంగా బిజెపి పార్టీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ లను తనదైన శైలిలో విమర్శిస్తూ వస్తున్న ప్రకాష్ రాజ్ చివరికి తన రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకున్నారు.ప్రకాష్ రాజ్ సౌత్ ఇండియా లో తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఒక అద్భుతమైన నటుడిగా ఎన్నో గొప్ప పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న అటు నార్త్లో కూడా హిందీ సినిమాల్లో మంచి పాత్రలు చేశారు. జాతీయ ఉత్తమ నటుడిగా పలు మార్లు అవార్డులు అందుకున్న ప్రకాష్ రాజ్ సమాజం గురించి తన దేశం గురించి తను ఒక సామాజిక బాధ్యత గా ఫీల్ అవ్వడమే కాకుండా తెలంగాణలో కొండారెడ్డిపల్లి  గ్రామాన్ని దత్తత తీసుకొని దానిని అభివృద్ధి చేస్తున్నారు.అయితే సమాజం గురించి రాష్ట్రాల్లో కేంద్రాలు ఉన్న ప్రభుత్వాలు గురించి పలు వేదికల మీద తన అసహనాన్ని విమర్శలు చేసే ప్రకాష్ రాజ్ పలు పార్టీల నుంచి నాయకుల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు.ఇప్పుడు వారందరికీ సమాధానంగా తను ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా కర్ణాటక పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది తాను కేవలం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అని ఈ నియోజకవర్గం అనేది త్వరలో వెల్లడిస్తానని ప్రకాష్రాజ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

Post a comment

0 Comments