మరీ ఆ సెక్సీ భామ తోనా??

బాలీవుడ్ లో బాగా బోల్డ్ గా ఉండే హీరోయిన్ ల పేర్లు చెప్పమంటే ఆ లిస్ట్ లో ముందు వరుసలో ఉండే ముద్దుగుమ్మ ఈషా గుప్తా. అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా హాట్ హాట్ కిస్ సీన్స్ లో, బోల్డ్ ఫోటో షూట్స్ లో మీతి మీరి రెచ్చిపోవడం ఈ భామకు ఎక్సపోసింగ్ తో పెట్టిన విద్య.  హిందీ హీరోయిన్ ల గురించి కాస్త అవగాహన ఉన్న ఎవరైనా ఒక్కసారి గూగుల్ లో ఈమె పేరు సెర్చ్ చేస్తే హాట్ హాట్ స్టిల్సే కనిపించి వాళ్లకు కిక్ ఎక్కించడం ఖాయం. ఆ మధ్య ఏదో వెబ్ సిరీస్ కోసం ఈషా ఒక లెస్బియన్ సీన్ లో కూడా రెచ్చిపోయి నటించింది.
అలాంటి ఈషా గుప్త ను తెలుగు లో  వినయ విధేయ రామ సినిమా కోసం తీసుకున్నారు అదీ ఓ ఐటెంసాంగ్ కోసం. అసలే బోయపాటి మాస్ సినిమా  ఈ బ్యూటీ నేమో అసలేం దాచుకోకుండా చూపించే రకం ఇక ఆ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో మాస్ కు థియేటర్ లో ఎంత కిక్ ఎక్కిస్తుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

ఈషా కంటే ముందు  ఈ ఐటెంసాంగ్  చేయడానికి బోయపాటి ఇంతకు ముందు వర్క్  చేసిన హీరోయిన్ లు రకుల్, కాజల్, క్యాథరీన్ లాంటి పేర్లు వినిపించాయి. వీళ్లలో క్యాథరీన్ ను ఫిక్స్ చేసుకున్నారు కూడా కానీ ఎందుకో   ఆఖరి నిమిషంలో క్యాథరీన్ ను కూడా తప్పించి ఈషా గుప్తాకు ఆ ఛాన్స్ ఇచ్చారు.

14వ తేదీ నుంచి అన్నపూర్ణ స్టుడియోస్ లో ఈ ఐటెంసాంగ్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో ఇదొక పబ్ సాంగ్ అంట దానికోసం అన్నపూర్ణ స్టుడియోస్ లో బాగా  రిచ్ లుక్ ఉట్టిపడేలా ఓ పబ్ సెట్ వేశారు. ఈ సెట్ లోనే ఈషా-చరణ్ తో సాంగ్ తీయబోతున్నారు.

ఇక వినయ విధేయ రామ సినిమా విషయానికివస్తే ఈ సినిమాకు సంబంధించి ఈషా గుప్తా చేస్తున్న ఐటెంసాంగ్ తో పాటు సినిమాకు సంబంధించి మరోపాట పెండింగ్ లో ఉంది. ఆ పాటను హైదరాబాద్ శివార్లలోని ఖానాపూర్ లో తీస్తారు. 22 నాటికి ఈ రెండు పాటల్ని కంప్లీట్ చేయబోతున్నారు.
రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్ రంగస్థలం తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద పెద్ద అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ
  వినయ విధేయ రామ సినిమాను విడుదల చేయబోతున్నారు. 

Post a comment

0 Comments