ఈసారి రామ్ బోల్డ్ గా కనిపిస్తాడట!!!!

ఈసారి రామ్ బోల్డ్ గా కనిపిస్తాడట!!!!Image credited from Twitter.com

ఎనర్జిటిక్ స్టార్ రామ్ మంచి సత్తా ఉన్న నటుడు. ఇలాంటి క్యారెక్టర్ నైనా తన ఎనర్జీతో అద్భుతంగా పండించడంలో నేర్పరి. అయితే గత కొంతకాలంగా రామ్ సరైన హిట్లు లేక బాగా సతమతమవుతున్నాడు. తనతో పాటు వచ్చిన తనకంటే వెనకాల వచ్చిన యువ హీరోలు అందరూ బ్లాక్ బస్టర్ హిట్లతో కెరీర్ లో ముందుకు దూసుకెళ్తుంటే హీరో రామ్ మాత్రం ఇంకా తన కెరీర్లో ఒడిదుడుకులను ఎదుర్కుంటూనే ఉన్నాడు. రామ్ కి అసలు సిసలు బ్లాక్ బస్టర్ చివరి హిట్ కందిరీగ సినిమా అనే చెప్పుకోవాలి. ఆ మధ్య వచ్చిన నేను శైలజ సినిమా కూడా మంచి విజయవంతమైన సినిమాగా నిలిచింది. కానీ ఒక హిట్ ఇస్తే దాని తర్వాత వరుసగా ఫ్లాపులు ఇవ్వడం రామ్ కు ఆనవాయితీగా మారిపోయింది.అలాంటి రామ్ ఇప్పుడు లేటెస్ట్గా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో జతకడుతున్నాడు.పూరి జగన్నాథ్ ఒకప్పుడు పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాని అందించిన దర్శకుడు కూడా గత కొంతకాలంగా సరైన హిట్టు కొట్టలేక చతికిలపడ్డాడు. తన కొడుకు ఆకాశం హీరోగా పెట్టి తీసిన మెహబూబా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది.ఒకప్పుడు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ లాంటి హీరోలతో సినిమాలు చేసిన పూరి జగన్నాథ్ ఇప్పుడు ఏ పెద్ద హీరో కూడా అవకాశం ఇవ్వడం లేదు.దాంతో మంచి కసి మీద ఉన్న పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఈ సారి సినిమా తీస్తుండడం బాగా అంచనాలను పెంచింది.పూరి జగన్నాథ్ తన పెన్ పవర్ తో రాసే డైలాగులు అతని సినిమాల్లో ఉండే హీరోల క్యారెక్టర్లు అంటే యూత్ లో, మాస్ లో మంచి క్రేజ్ ఉన్న మాట వాస్తవం.పూరి జగన్నాథ్ కు సరైన కథ దొరికి సరైన పాత్ర పడి ఆ పాత్రను అవలీలగా పోషించి కలిగితే కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర మరొకసారి ప్రూవ్ చేసుకోగలడు. మరి పూరి ఈసారి రామ్ తో తను తీస్తున్న ఈ కొత్త సినిమా వచ్చే సంవత్సరం లో అతని జీవితానికి మళ్లీ మరొక టర్నింగ్ పాయింట్  అవుతుందో లేదో వేచి చూడాలి.Post a comment

0 Comments