లెస్బియన్ పాత్ర చేస్తున్న సోనమ్ కపూర్!!!!

లెస్బియన్ పాత్ర చేస్తున్న సోనమ్ కపూర్!!!!సోనం కపూర్ బాలీవుడ్ హీరో మిస్టర్ ఇండియా లాంటి సినిమాలతో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిల్ కపూర్ కూతురు అనిల్ కపూర్ కుమార్తెగా హిందీ పరిశ్రమకు పరిచయం అయినా కూడా ఆ తర్వాత నీర్జ లాంటి సినిమాలతో తనకంటూ ఒక మంచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు తన తండ్రి అనిల్ కపూర్ తో కలిసి ఎక్ లడకికో దేఖా తో ఐసా లగా అనే సినిమాలో నటిస్తుంది. ఈ చిత్ర ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేశారు ఒక రొమాంటిక్ డ్రామాగా కనిపిస్తున్న ఈ చిత్ర కథ లో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో సోనం కపూర్ ఒక లెస్బియన్ తండ్రి తన కోసం మంచి మంచి అబ్బాయిలను చూస్తూ వాళ్ళని పెళ్లి చేసుకోమని కూతుర్ని అడగడం ఒక అబ్బాయి హీరోయిన్ లవ్ చేయడం అయితే వీటిలో దేనికీ హీరోయిన్ ఒప్పుకోకుండా ఉండడం చివరికి హీరోయిన్ తండ్రికి హీరోయిన్ ఒక లెస్బియన్ అని తెలియడం విషయాలన్నిటినీ ట్రైలర్ లో చూపించారు. పోతే ఈ సినిమాకు పెట్టిన క్యాప్షన్ the most unexpected romance of The year అనేది కూడా ఈ సినిమా కథలో ఉన్న భిన్నత్వాన్ని తెలియజేస్తుంది.  అనిల్ కపూర్ తో పాటు ఈ సినిమాలో జుహీచావ్లా రాజ్ కుమార్ లాంటి వాళ్లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Post a comment

0 Comments