అల్లు అర్జున్ మాటలకు అర్థమేంటి??

అల్లు అర్జున్ మాటలకు అర్థమేంటి??


అల్లు అర్జున్ మాటలకు అర్థమేంటి??అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ ఆఫ్ టాలీవుడ్. తను మైక్ ఎప్పుడు పట్టుకున్నా ఏదో ఒక మంచి విషయం లేదా గొప్ప విషయం చెప్పాలని ఆరాట పడుతుంటాడు. నిన్న జరిగిన పడి పడి లేచే మనసు సినిమా ఫంక్షన్ లో  కూడా అలానే కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాడు. ఇండస్ట్రీలో ఒక సినిమాకు చాలా మంది కష్టపడి పని చేస్తారని మనం ఆ వ్యక్తులకు అందరికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలని ఆ ఫంక్షన్ కు వచ్చిన జనాలకు కొంచం హార్స్ గా నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్  క్లాస్ పీకాడు. 

అయితే ఈ క్రమంలో బన్నీ తన స్పీచ్ ఇస్తుంటే ఒక దశలో ఆ స్పీచ్ లో సెటైర్ ఏమన్నా ఉందా అని అక్కడున్న జనాలకు డౌట్ వచ్చింది దానికి కారణం బన్నీ తన కంటే చిన్న హీరో అయిన శర్వానంద్ ను శర్వాగారు అంటూ  పిలవడం. నిజంగా అది జనాలకు సెటైరిక్ గానే  అనిపించింది. అసలు బన్నీ సడన్ గా రెస్పెక్ట్ గురించి ఎందుకు మాట్లాడారు అని అందరికి డౌట్ వచ్చింది ఒకవేళ ఈ మధ్య ఎవరైనా బన్నీ కి తక్కువ రెస్పెక్ట్ ఇచ్చారా?? ఏమో మరి ఆ విషయం బన్నీకే తెలియాలి.బన్నీ తన స్పీచ్ లో సింహ భాగం ఈ రెస్పెక్ట్ ఇష్యూ గురించే మాట్లాడాడు. అసలు బయట కూడా పెద్ద వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అని ఒక స్థాయిలో ఉన్న వాళ్లను ఎక్కడపడితే అక్కడ రెస్పెక్ట్ లేకుండా పిలిచేస్తున్నారు. అది తప్పు. హే.. కేసీఆర్.. హే చంద్రబాబు ఏంటిది? కేసీఆర్ గారు అనాలి. చంద్రబాబు గారు అనాలి. ఆ మధ్య టీవీలో చూశాను, ఒకడైతే హే.. చిరంజీవి అని అన్నాడు. చిరంజీవి ఏంట్రా.. చిరంజీవి గారు. పవన్ కల్యాణ్ గారు."రాజకీయ నాయకుడు, సినిమా వాళ్లు అయినంత మాత్రాన గౌరవం ఇవ్వకూడదని లేదని, మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా గారు అని సంభోదించాలంటూ బన్నీ క్లాస్ పీకాడు. పడి పడి లేచే మనసు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన అల్లుఅర్జున్.. ఇలా సినిమా గురించి తక్కువ, ఈ 'గారు' అనే టాపిక్ పై ఎక్కువగా మాట్లాడాడు.
అయితే ఇక్కడ బన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. 'గారు' అని పేరు చివర తగిలించనంత మాత్రాన అది గౌరవం ఇవ్వనట్టు కాదు. బాగా ఇష్టపడే వ్యక్తుల్ని ఏకవచనంలో పిలవడం కూడా గౌరవమే. చిరంజీవి, పవన్ కల్యాణ్, కేసీఆర్ లాంటి వ్యక్తుల్ని ఏకవచనంలో పిలిస్తే అది గౌరవభంగం కిందకురాదు. అందులో అభిమానం ఉంటుంది.
మా కేసీఆర్, మా పవన్, మా చిరు అంటూ అభిమానులు గట్టిగా అరిస్తే అది గౌరవభంగం కాదు. పేరుకు ముందు 'అరేయ్', 'ఒరే' లాంటి పదాలు చేరిస్తే అది గౌరవానికి భంగం కలిగినట్టు. ఈ చిన్న తేడా బన్నీకి తెలియదంటారా?

Post a comment

0 Comments