అల్లు అర్జున్ కొత్త సినిమా ఎవరితోనంటే!!!

అల్లు అర్జున్ కొత్త సినిమా ఎవరితోనంటే!!!

అల్లు అర్జున్ కొత్త సినిమా ఎవరితోనంటే...


స్టైల్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత ఆ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఈ రోజు మళ్ళీ తన కొత్త చిత్రం విశేషాలను ప్రకటించారు. ఇంతకుముందు జులాయి సన్నాఫ్ సత్యమూర్తి ఇలాంటి సినిమాలను అల్లు అర్జున్ తో తీసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన 19 వ సినిమా చేయబోతున్నారు. అరవింద సమేత లాంటి భారీ సంచలన విజయం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ చేయబోయే సినిమా ఇదే సినిమాను గీతా ఆర్ట్స్ హారిక హాసిని బ్యానర్ ల మీద అల్లు అరవింద్ రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాకి ప్రముఖ టెక్నీషియన్లు పనిచేస్తారని తెలియవస్తుంది. 


అయితే బన్నీ ఇంతకుముందు చేసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. తను తొలిసారి దర్శకునిగా అవకాశం ఇచ్చిన ప్రముఖ కథా రచయిత వక్కంతం వంశీ తన కథ తో విజయాన్ని నమోదు చేసుకోలేకపోయాడు. అటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన అజ్ఞాతవాసి సినిమా బాక్సాఫీసు వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.  ఆ తర్వాత త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన అరవింద సమేత వీరరాఘవ సినిమా వాళ్ళిద్దరి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.  అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి రెెండు సినిమాలకు పని చేసినప్పుడు ఆ రెండు సినిమాల్లో   జులాయి బాగా ఆడగా సన్నాఫ్ సత్యమూర్తి సినిమా యావరేజ్ సినిమాగా అనిపించుకుంది. స్టైలిష్ స్టార్ అన్న బిరుదు ఉన్న అల్లు అర్జున్ ని త్రీవిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలతో పక్కింటి అబ్బాయి గా  ఆయన సినిమాల్లో చూపించారు. 
అయితే మరి ఈసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. గతంలో వచ్చిన పుకార్ల నేపథ్యంలో హిందీ సినిమా సోను కి టిటు కి స్వీటీ అనే సినిమాను తెలుగులో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రీమేక్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు  ఈ సినిమా దానికి రీమేక్గా ఉందా లేదా త్రివిక్రమ్ మళ్లీ మరొక కొత్త కథతో ఈ సినిమా తీయబోతున్నరా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ మధ్య తెలుగు సినిమా మార్కెట్ విపరీతంగా పెరిగిపోవడం తన సినిమాలు హిందీలోకి డబ్ అయ్యి అల్లు అర్జున్ కి కూడా విపరీతంగా క్రేజ్ రావడంతో  ఈ సినిమా కథ స్పాన్ కూడా పెరిగే అవకాశం ఉంది అలాగే సినిమా బడ్జెట్ కూడా వంద కోట్లకు పైమాటే ఉంటుందని సమాచారం.

Post a comment

0 Comments