షారుక్ ఖాన్ కథతో రాజమౌళి సినిమా!!!!

షారుక్ ఖాన్ కథతో రాజమౌళి సినిమా!!!!
యస్ యస్ రాజమౌళి బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు. తెలుగు సినిమా చరిత్రలో అన్ని రికార్డులను తిరగ రాసిన గొప్ప సినిమాలను అందించిన మహా మేధావి. ఆయన ఇప్పుడు వరకు తీసిన సినిమాల్లో ఈ ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వ లేదంటే ఆయన ట్రాక్ రికార్డ్ లో ఉందో మనం గమనించవచ్చు. అసలు ఎవరు ఊహించని రీతిలో ఆయన తన సినిమాలను తీస్తుంటారు కొన్ని వందల కోట్ల బడ్జెట్టు బాహుబలిలాంటి సినిమా తెలుగులో వస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు ఇలాంటి దాన్ని ఆయన కలగని అంతటి గొప్ప అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.


బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా ఏమై ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు సినీ ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూశారు.అందరి అంచనాలను అందుకునే విధంగానే రాజమౌళి తన నెక్స్ట్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ రాంచరణ్ లతో భారీ మల్టీ స్టారర్ గా చేస్తున్నారు.అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి దీనికి సంబంధించి రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.వాటిలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ సినిమా కథ గురించి ఈ సినిమా కథ 1930 బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని రామ్ చరణ్ ఒక ల్నిి పోలీస్ అధికారి ఎన్టీఆర్ ఒక దొంగ గా  కనిపిస్తాడని చెప్తున్నారు అయితే ఇది ఇప్పటి వరకు అందరూ చెప్పుకుంటున్న వార్త ఇప్పుడు ఈ సినిమా గురించి సరికొత్త న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

ఆ వార్త ఏంటంటే ఈ సినిమా 1990వ దశకంలో బాలీవుడ్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా కరణ్ అర్జున్ కు రీమేక్ సినిమా అని... ఆ సినిమాలో షారుక్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఇద్దరు అన్నదమ్ములుగా నటించారు ఒక ఊర్లో ఉన్న నియంత వాళ్ల కుటుంబాన్ని అన్యాయంగా బలి చేస్తే ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒక జన్మలో చనిపోయి మళ్ళీ ఇంకో జన్మ లో వేరే వేరే దగ్గర పుట్టి మళ్ళీ ఎలా  కలిసి తమ శత్రు మీద పగ తీర్చుకున్నారు అనేది ఆ చిత్ర కథ. ఇప్పుడు రాజమౌళి తను తీస్తున్న సినిమాలో కథ కూడా దాదాపుగా ఇలాగే ఉంటుందని చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రామచరణ్ అన్నదమ్ములుగా నటిస్తున్నారని గత జన్మలో ఇద్దరు కలిసి ఉండి తమ కుటుంబానికి తల్లికి దూరమై అనుకోకుండా మరణించి మళ్లీ ఇంకో జన్మ ఎత్తుతారు ఈ జన్మలో ఒకరికి ఒకరు బద్ద శత్రువులు గా ఉండి ఆ తర్వాత నిజం తెలుసుకుని ఏ vవిధంగా తమ శత్రువు మీద పగ తీర్చుకున్నారు అనేదే ఈ సినిమా కథ అంటున్నారు.


అయితే ఇప్పుడు ఈ వార్త నిజమో కాదో ఎవరికీ కచ్చితంగా తెలియదు. ఒకవేళ అదే నిజమైతే కరణ్ అర్జున్ సినిమా లో ఉన్నట్టుగా అద్భుతమైన సెంటిమెంట్ ఈ సినిమాలో కూడా పండే అవకాశం ఉంది. ఒకవేళ కాకపోతే ఈసారి రాజమౌళి తన సినిమాల్లో ఏలాంటి కొత్తదనాన్ని ఏలాంటి భారీ కథని చూపిస్తారో మనం వేచి చూడాల్సిందే.

Post a comment

0 Comments