ఆ సినిమాలో అంత మంది స్టార్సా ?

ఆ సినిమాలో అంత మంది స్టార్సా ?

 సినిమాలో అంత మంది స్టార్సా ?
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బయోపిక్ సినిమా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ తీస్తున్న విషయం తెలిసిందేప్రపంచంలోనే ప్రప్రథమంగా ఒక తండ్రి బయోపిక్ని కొడుకు తీస్తుండడం చాలా పెద్ద విశేషం. తన తండ్రి పాత్రలో నటిస్తున్న బాలకృష్ణ సినిమాల్లో సుమారుగా 36 పాత్రల్ని చేస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు అని రెండు పార్ట్లు గా రాబోతున్న సినిమా లో మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది తర్వాత ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 25 తారీకు రిలీజ్ అవుతుంది. జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమా మీద తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.Image credit from official Twitter account of 
Respectively


అయితే సినిమాలో నందమూరి తారకరామారావు గారి పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తుండగా మిగతా ముఖ్య పాత్రల్లో చాలా పెద్ద భారీ తారాగణం  నటిస్తున్నారుఅలనాటి అందాల నటి సావిత్రి గా నిత్యామీనన్, నందమూరి తారకరామారావు గారి కుమారుడు హరికృష్ణ గా కళ్యాణ్ రామ్, అక్కినేని నాగేశ్వర రావు గా ఆయన మనవడు అక్కినేని సుమంత్, నందమూరి తారకరామారావు గారి భార్య బసవతారకంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్, అందాల తార శ్రీదేవి గా రకుల్ ప్రీత్ సింగ్, అలనాటి ప్రసిద్ధ దర్శకుడు కె.వి.రెడ్డి గా దర్శకుడు క్రిష్, ఇంకా కైకాల సత్యనారాయణ, హీరోయిన్ షాలిని పాండే హీరోయిన్ ప్రణీత, ప్రకాష్ రాజ్ , ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, హీరోయిన్ హన్సిక, యాక్టర్ నరేష్, మురళీ శర్మ ఇలా దాదాపుగా ఒక యాభై మంది భారీ తారాగణం అంతా చిత్రంలో మనకు కనిపించి సందడి చేయబోతున్నారు.

ప్రపంచ చరిత్రలోనే ప్రప్రథమంగా సొంత తండ్రి జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్న నందమూరి బాలకృష్ణ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పాత్రలో మేరకు ప్రేక్షకులను మెప్పించాడో లేదో చూడాలంటే సంక్రాంతి వరకు వేచి చూడక తప్పదు. ఇంత భారీ సినిమాకు సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి తన సంగీతంతో  ఒక అద్భుతం చేయబోతున్నారు. నభూతో నభవిష్యత్ అన్న విధంగా దర్శకుడు క్రిష్ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ విషయంలో సినిమాకి సంబంధించి భారీ మొత్తంలోనే బిజినెస్ జరిగింది సంక్రాంతికి ఎన్ని సినిమాలు పోటీలో ఉన్న ఖచ్చితంగా ఎన్టీఆర్ బయోపిక్ మీద ప్రేక్షకులకు చాలా అంచనాలు ఉంటాయి. తెలుగువారందరూ గర్వపడేటంత గొప్ప నటుడు, రాజకీయ నాయకులు అయినటువంటి నందమూరి తారక రామారావు గారి జీవితచరిత్ర చూడటానికి తెలుగు ప్రేక్షకులు అందరూ కచ్చితంగా ఒక్కసారైనా వస్తారని ఈ సినిమా మేకర్స్ ఆశపడుతున్నారు.


Post a comment

0 Comments