మెగా ప్రిన్సెస్ నిహారిక దెయ్యమా??

మెగా ప్రిన్సెస్ నిహారిక దెయ్యమా??

మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల చాలా చలాకీగా ఉండే అమ్మాయి. ఒక మనసు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది అయితే ఆ సినిమాలో తన నటనకు మంచి పేరే వచ్చిన సినిమా అంతగా విజయం సాదించకపోవడంతో నిహారిక కు పెద్దగా అవకాశాలు రాలేదు.ఆ తర్వాత తాను ముద్ద పప్పు ఆవకాయ్ నాన్న కూచి లాంటి వెబ్ సిరీస్ లు అలాగే తమిళ్ లో కొన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయింది.


అయినా కూడా పట్టు వదలకుండా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నీహారిక తాజాగా ఫైట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ తో కలసి సూర్యకాంతం అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో నిహారిక ఒక దెయ్యం గా నటిస్తుందని తన ప్రేమకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే యువతిగా కనిపించ బోతుంది. నిర్వణ ఫిలిమ్స్ వాళ్ళు తమ.మొదటి సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమాతో ప్రణీత్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు.

Post a comment

0 Comments