విలన్ గా నటించనున్న మెగా హీరో

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న యువ హీరోల్లో వరుణ్ తేజ్ ది ఒక ప్రత్యేకమైన స్థానం. అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఇటు కథా బలం ఉండి కొత్తగా ఉండే సినిమాలు చేస్తున్నాడు.

తన తొలి సినిమా ముకుందా తోనే తన పంథా ఎంటో చెప్పకనే చెప్పిన వరుణ్ కెరీర్లో ఎక్కువ హిట్స్ లేనప్పటికీ తనకంటూ ఒక మార్కెట్ యూత్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.ఫిదా తో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించిన ఈ యువ హీరో ఇప్పుడు విలన్ గా నటించబోతున్నాడు అవును ఇది నిజం. దర్శకుడు హరీష్ శంకర్ తమిళ్ లో బాగా హిట్ అయిన జిగర్ తాండ సినిమా ను తెలుగు లో రీమేక్ చేస్తున్నారు అయితే ఆ సినిమాలో విలన్ గా నటించిన బాబీ సింహ పాత్ర కోసం తెలుగు లో వరుణ్ ని సంప్రదించారని దానికి వరుణ్ తేజ్ ఒప్పుకున్నాడని సమాచారం. తమిళ్ లో హీరోగా సిద్దార్థ్ నటించిన ఆ సినిమా కు కార్తిక్ సుబ్బరాజ్ దర్శకుడు. అన్నట్టు తమిళ్ లో విలన్ రోల్ చేసిన బాబీ సింహ కు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది చూద్దాం మరి ఒక వేళ వరుణ్ తేజ్ ఆ రొలె చేస్తే తనకు ఎలాంటి అవార్డ్ వస్తుందో.

Post a comment

0 Comments