కళ్ళు చెప్పే కథలు!!!

కళ్ళు చెప్పే కథలు!!!

కళ్ళు చెప్పే కథలు!!!


         

కళ్ళు, కనులు, నయనాలు మనిషి జీవితంలో అన్ని భావాలను అలవోకగా ప్రదర్శించే బ్రహ్మాస్త్రాలు!!!

రెండంటే రెండే కనులు...
చెప్పగలవు ఎన్నెన్నో కబుర్లు!!!


ఒక్క చూపుతో వంద మాటలు మాట్లాడ గలం!!!

చూపు... మనిషి చూపులో ఎన్నో రకాలు ఉన్నాయి
ముఖ్యంగా ఆడవారి చూపుల్లో...

ఓర చూపు

కొంటే చూపు

మత్తెక్కించే చూపు

మైమరచి పోయే చూపు

ఇలా ఇంకా చాలానే ఉన్నాయి


         
ఆడదాని ఓర చూపులో జగాన ఓడిపోని దీరుడెవ్వడు
అని ఆరుద్ర గారు ఏనాడో రాశారు...

కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే అని వెన్నెలకంటి వివరించారు

కళ్ళు కళ్ళు ప్లస్సు అని ఈతరం అమ్మాయిలు అబ్బాయిలు పాడుకున్నారు


భాషా భేదాలు లేకుండా మనుషులందరికి వచ్చిన భాష కళ్ళ భాష!!!

కలువ రేకుల్లాంటి కళ్ళంటారు
చక్రల్లాంటి కళ్ళంటారు
విప్పారిన నేత్రా లంటారు
చింత నిప్పుళ్ళాoటి కళ్ళంటారు

ఎన్ని రకాలుగా పిలిచినా ఏమని చెప్పుకున్నా గుప్పెడంత గుండెలో చెప్పలేని అలజడులు 
సృష్టించేవే ఆ కళ్ళు
కళ్ళు 
కన్నీళ్లను జార్చే ఆ కళ్ళు 
కథలను చెప్పే ఆ కళ్ళు
విషాదాన్ని దాచేవి
వినోదాన్ని చూసేవి
వివరాలు చెప్పేవి


మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఆ మౌనంలో కూడా మాట్లాడేవే కళ్ళు

ప్రేమికులకు కనులే వాట్సప్

పెద్దల కనుసైగే పిల్లలకు హాండ్సప్ 

గుండెల నిండా ప్రేమ ఉందంటారు
కానీ అది చూపించేది కళ్ళతోటే కనిపించేది కళ్ళలో నే

ఒక్కసారి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ కళ్ళలోకి చూడండి
మీ మీద ఎంత ప్రేముందో మీకు కనిపిస్తుంది.Post a comment

0 Comments