సూర్య కొత్త లుక్ చూశారా??

సూర్య కొత్త లుక్ చూశారా??తమిళ హీరో సూర్య ఆయన చేసే ప్రతి సినిమాలో ఏదో ఓ కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. గజిని సినిమాతో తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది అక్కడి నుంచి ఆయన తమిళ్ లో చేసే ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ సినిమా గా రావడం జరుగుతుంది. యూత్ లో మహిళా ప్రజల్లో మంచి క్రేజ్ ఉన్న నటుడు సూర్య తను చేస్తున్న విభిన్నమైన పాత్రలతో అన్ని వర్గాల ప్రజల నుండి అమితంగా ఆకట్టుకుని తనకంటూ ఒక ప్రత్యేక  గుర్తింపును సంపాదించుకున్నారు.

అయితే గత సంవత్సరం హీరో సూర్య నటించిన గ్యాంగ్ సినిమా తెలుగులో తో రిలీజ్ అయి అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోతింది. అయితే ఈసారి సూర్య దర్శకుడు కె.వి.ఆనంద్ తో మరోసారి జత కడుతున్నారు కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన సూర్య కొత్త లుక్ ను రిలీజ్ చేశారు. ఇకపోతే ఈ సినిమా పేరును కాప్పన్ గా నిర్ణయించారు. ఈ ఇద్దరి కలయికలో ఇంతకుముందు బ్రదర్స్ అనే సినిమా వచ్చి అది అనుకున్నంత విజయాన్ని సాధించలేదు అయితే ఈ సారి వీరిద్దరూ ఒక సరికొత్త కథతో వస్తున్నారని ఈ సినిమాలో చాలా పెద్ద స్టార్ కాస్టింగ్ కూడా ఉందని సమాచారం.ఏది ఏమైనప్పటికీ ఈ కొత్త సంవత్సరం సూర్యకు మళ్లీ విజయాలను ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

Post a comment

0 Comments