ఒంటరి పోటీనే అంటున్న పవన్ కళ్యాణ్!!!

ఒంటరి పోటీనే అంటున్న పవన్ కళ్యాణ్!!!


                                                   image credited from livemint.com

పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ బడా స్టార్ కు ఉన్న క్రేజ్ అసాధారణమైనది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా వెండితెరకు పరిచయం అయినా కూడా ఆ తర్వాత తన సినిమాలతో తన క్యారెక్టర్ తో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని ఫాలోయింగ్ ని పవన్ కళ్యాణ్ ఏర్పరచుకున్నారు.  అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా వచ్చి ప్రజారాజ్యం పార్టీ తరపున ఎన్నికల్లో విపరీతంగా ప్రచారం చేశారు కానీ ఆ తర్వాత ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ ఓడిపోవడం ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో పవన్ కళ్యాణ్ కొన్నాళ్లపాటు మామూలుగా సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ తర్వాత మళ్లీ  జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో ఆక్టివ్ అయ్యారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తన మద్దతు ఇచ్చి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి పరోక్షంగా సాయపడ్డారు.ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో పవన్ కళ్యాణ్ కు జరిగిన గొడవల కారణంగా ఆయన తన మద్దతును ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత అధికార పార్టీ పైన పవన్ కళ్యాణ్ తీవ్రమైన విమర్శలు చేస్తూ జనసేన పోరాట యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. ఉద్దాన బాధితుల సమస్య లాంటి వాటిని ఆయన జనాల్లోకి తీసుకెళ్లగలిగారు.                                                     image credited from english.tupaki.com

అయితే మళ్లీ ఇప్పుడు 2019 సాధారణ ఎన్నికలకు సమయం వస్తుండడంతో ఆంధ్రప్రదేశ్లో ఈసారి కూడా మళ్లీ జనసేన టిడిపి కలిసి పోటీ చేస్తాయి అని ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత కొన్ని రోజుల నుంచి విపరీతంగా ప్రచారం చేస్తుండడంతో పవన్ కళ్యాణ్ ఈసారి కాస్త ఘాటుగానే స్పందించారు.వచ్చే ఎన్నికల్లో తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని ఒంటరిగానే ఎలక్షన్ కి వెళ్తున్నాను అని కేవలం కమ్యూనిస్టులతో మాత్రమే తాను ఎన్నికల్లోకి వెళ్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఒకవైపు అధికార పార్టీ అభివృద్ధి కార్యక్రమాల పేరిట జనాలకి వెళ్తూ రానున్న ఎన్నికలకు సమాయత్తం అవుతోంది మరోవైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రల పేరుతో ఎన్నో సంవత్సరాల నుంచి జనాల మధ్య లోనే ఉంటున్నారు ఇటు పవన్ కళ్యాణ్ కూడా గత కొన్ని నెలల నుంచి జనసేన పోరాట యాత్ర అంటూ విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంతటా పర్యటిస్తున్నారు. కుల సమీకరణాలు కి బాగా ఆస్కారం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి జరిగే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఒక కులం వారి ఓట్లను బాగా ప్రభావితం చేయగలదు అన్న వార్తలు వస్తుండటంతో 2019 ఎన్నికల్లో ఈ సారి పవన్ కళ్యాణ్ వల్ల అటు తెలుగుదేశం పార్టీకి గాని కానీ ఇటు జగన్ పార్టీకి గాని భారీ నష్టం వాటిల్లేలా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అధికారాన్ని సంపాదించుకునేంత సీట్లు జనసేన పార్టీ పొందలేక పోవచ్చు కానీ ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటులో తమ వంతు పాత్ర ఉండేలా సీట్లు గెలుచుకోవాలని ఆ పార్టీ చాలావరకు ప్రయత్నాలు చేస్తుంది. నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఎక్కువగా పోటీ ఉంటుంది కానీ ఒక కులం ఓట్లను భారీగా ప్రభావితం చేసేంత సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఈ రెండు పార్టీల మధ్య ఓట్లను చీల్చడం ద్వారా పార్టీ ల గెలుపోటములను డిసైడ్ చేస్తుందని అంటున్నారు.మరొకవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తో కూడా పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు మంతనాలు సాగించారని రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని కూడా చాలావరకు వదంతులు వచ్చాయి కానీ అవి నిజం కాదని అటు వైఎస్ జగన్ ఇటు పవన్ కళ్యాణ్ వాటిని ఖండిస్తూ వచ్చారు.ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జనసేన పార్టీ తాను సొంతంగానే ఎన్నికల్లో కి వెళ్తున్నాను అని ప్రకటన ఇవ్వడంతో కచ్చితంగా అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత భయం ప్రారంభమై ఉంటుంది. ఎందుకంటే ఒక సామాజిక వర్గం ఓట్లను ప్రభావితం చేసే జనసేన తమ ఓటు బ్యాంకుకు ఎక్కడ గండి కొడుతుందో అన్న భయం ఆ పార్టీల్లో ఉండక తప్పదు. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎలాంటి సంచలనాలు జరుగుతాయి అన్న విషయాలు తేలాలంటే మనం 2019 ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Post a comment

0 Comments