Header Ads

స్వామి వివేకానంద భరతమాత ముద్దుబిడ్డ

స్వామి వివేకానంద భరతమాత ముద్దుబిడ్డ


భారతదేశం అందించిన అద్భుతమైన వ్యక్తులలో స్వామి వివేకానంద ఒకరు. 1863 జనవరి 12 న జన్మించారు. అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా, రామకృష్ణ పరమ హంసకు ఈయన ప్రియ శిష్యుడు.
తన అద్భుతమైన ఆలోచనలతో సందేశాలతో ఈ ప్రపంచాన్ని ఆయన సమ్మోహన పరచారు. యువతకు ఆయన ఇచ్చిన సందేశం ఇప్పటికీ వారిలో ఒక గొప్ప నమ్మకాన్ని నిలబెట్టే కలిగే శక్తి కలదు. తన జీవితమంతా మనుషుల్లో ఉన్న శక్తి గురించి చెప్పడానికి ఇతరుల్లో ఉన్న నిజమైన నమ్మకాన్ని మేల్కొల్పడానికి ఆయన చాలా శ్రమించారు. మనిషి చాలా గొప్ప వాడని అతని లో ఉన్నవి అసామాన్యమైన శక్తి సామర్థ్యాలు అని వాటి ద్వారా తాను ఏదైనా సాధించగలడు అని ఆయన ఈ ప్రపంచానికి చాటి చెప్పారు. పిరికిపందల ఉండిపోకూడదు అని జీవితంలో మీరు ఏదైనా సాధించగలిగే ఎంత శక్తి మీలోనే ఉందని యువతకి ఆయన సందేశం ఇచ్చారు. ఆమె అమెరికా లాంటి దేశంలో కి వెళ్లి అక్కడ ఉన్న జనాలను కూడా తన అద్భుతమైన ఆలోచనలతో సందేశాలతో మెప్పించారు. చికాగో లోని ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రప్రథమంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని అన్నారు. తన జీవితంలో బ్రహ్మచారిగా ఉన్న స్వామి వివేకానంద మనిషి మేధస్సు, శక్తి యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. తన తుది శ్వాస వరకు ఇతరులలో పోరాటపటిమను నమ్మకాన్ని నింపడానికి వివేకనంద ప్రయత్నించారు. చాలా చిన్న వయసులోనే ఆయన మరణించినప్పటికీ ఈ ప్రపంచం మీద ఆయన చెరిగిపోని ముద్ర వేశారు. ఈరోజు ఆయన జన్మదినం అలాగే ప్రపంచ వ్యాప్తంగా యూత్ డే గా కూడా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మరొక్కసారి స్వామి వివేకానంద చెప్పిన అద్భుతమైన వాక్యాలను మనం గుర్తు చేసుకుందాం.
లేవండి మేల్కొనండి గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి

కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేచినందుకు

జీవితంలో ధనం నష్ట పోతే కొంత కోల్పోయినట్లు కాని వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్టు

పోరాటంలో నైనా మృత్యు వు లోనైనా మీ శక్తిని విశ్వసించండి ప్రపంచంలో  పాపం అనేది ఉంటే
అది మన బలహీనత మాత్రమే

ఏ పరిస్థితిలోనైనా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి

బలమే జీవనం బలహీనతే మరణం


విజయానికి తొలిమెట్టు మనపై మనకు విశ్వాసం ఉండటమే


రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తి తో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు

ఉదయం తో కృషి చేస్తే మీరు కాకపోయినా రేపైనా విజయం తప్పదు

ప్రపంచ మనది గొప్ప వ్యాయామశాల మనం ఇక్కడికి రావడం అంటే మనల్ని మనం బలవంతులుగా చేసుకోవడమే

మీలో దాగిఉన్న శక్తి లో మీకు తెలిసింది చాలా తక్కువ
లేని సముద్రంలా వ్యాపించిన అనంత దివ్య త్యాలు మీకు చాలా ఉన్నాయి


డబ్బు లేని వాడు కాదు జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడు పేదవాడు

ఆత్మవిశ్వాసంతో  అడుగు ముందుకు వేస్తే ఏదైనా సాధించగలం

మెదడులో ఒక ఆలోచన పుట్టి దాన్ని మీ మనసు 
నమ్మ గలిగితే మీరు దాన్ని కచ్చితంగా సాధించగలరు

No comments