Featured Post

[TRENDING]

Friday, 25 January 2019

సిరివెన్నెల ను వరించిన పద్మ శ్రీ

author photo

సిరివెన్నెల ను వరించిన పద్మ శ్రీ




విరించినై విరచించితిని అంటూ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో పాటలు రచించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి  ఇప్పటికే పలు అవార్డులు లభించాయి కానీ ఇప్పుడు లభించిన పద్మశ్రీ అవార్డు వీటన్నిటి కంటే చాలా పెద్దది. ఆయనకున్న ప్రతిభకి ఆయన రాసిన పాటలకు ఇప్పటికే ఆయనకు ఈ అవార్డు రావాల్సి ఉందని చాలామంది ప్రముఖులు అభిప్రాయపడ్డారు కానీ కాస్త లేటుగా అయినా సరే ఇప్పటికీ ఆయన ప్రతిభను గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు పలువురు సినీ ప్రముఖులు తమ సంతోషాన్ని వెలుబుచ్చుతున్నారు.


తెలుగు సినీ సాహిత్య లోకంలో తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేసిన సీతారామ శాస్త్రి గారు  ఇప్పటికే కొన్ని వేల పాటలను రచించారు. ఆరుద్ర ఆత్రేయ కొసరాజు కృష్ణశాస్త్రి సీనారే వేటూరి లాంటి ఉద్దండుల మధ్య తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన తన మొదటి సినిమా విశ్వనాథ్ గారి దర్శ కత్వంలో లో వచ్చిన సిరివెన్నెల సినిమా తో పరిచయం అయ్యి  ఆ  పేరునే తన ఇంటి పేరుగా చేసుకున్నారు. ప్రేమ గీతాలు విరహ గీతాలు టీజింగ్ సాంగులు , ఆలోచన రేకెత్తించే విప్లవాత్మక సాంగులు దేవుడు గొప్పతనం గురించి కులాలు మతాల మధ్య ఉన్న అంతరాల గురించి దేశం గురించి ఇలా ఆయన రాయని పాటంటు లేదు. దేవుడు కరుణిస్తాడు అని ఆశ చెప్పినా నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అంటూ నిలదీసిన అది ఆయనకే చెల్లింది. ఇప్పటి వరకు  సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలకు జాతీయ రాష్ట్ర అవార్డులు తో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా ఎన్నో లభించాయి. కొన్ని సినిమాల్లో ఆయన అతిథి పాత్రల్లో కూడా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా గాయం సినిమాలో తానే రాసిన పాట నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అనే దాంట్లో ఆయన నటిస్తూ ఆ పాటను పాడిన విధానం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.   మనసంతా  నువ్వే లాంటి సినిమాల్లో అతిథి పాత్రలో నటించి కథను మలుపు తిప్పే అనేక ముఖ్య పాత్రలను ఆయన పోషించడం జరిగింది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అత్యంత గొప్ప పాటల రచయిత లలో సీతారామశాస్త్రి ఒకరు ఈ మధ్య ఆయన రాస్తున్న పాటల సంఖ్య తగ్గిపోతున్న కూడా రాసి కంటే వాసి గొప్పది అన్నట్టుగా సీతారామశాస్త్రి గారు ఇప్పటివరకు రాసిన పాటలు ఎలా చరిత్రలో గొప్ప ఆణిముత్యాలుగా నిలిచిపోయాయో అలాగే ఇక మీదట ఆయన రాసిన పాటలు కూడా అలాగే నిలిచిపోవాలని ఆశిస్తూ సీతారామశాస్త్రిగారికి శుభాకాంక్షలు తెలుపుదాం.

This post have 0 Comments


EmoticonEmoticon

Next article Next Post
Previous article Previous Post

Advertisement