Header Ads

చిత్రాలహరి మూవీ ఫస్ట్ లుక్

చిత్రాలహరి మూవీ ఫస్ట్ లుక్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో వస్తున్న నూతనఈ కాంబినేశన్ లో వస్తున్న సినిమా చిత్రలహరి. ఐదు అక్షరాలు ఐదు పాత్రలు అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇంటిలిజెంట్ లాంటి అతి పెద్ద భారీ ఫ్లాప్ సినిమా తర్వాత సాయి ధరంతేజ్ నుంచి వస్తున్న మరో సినిమా ఈ చిత్రలహరి.  రామ్ తో ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమా తీసి ఫ్లాప్ ను మూటగట్టుకున్న తర్వాత దర్శకుడు కిషోర్ తిరుమల నుంచి వస్తున్న మరో సినిమా కూడా ఇదే. హలో సినిమా ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ నీది నాది ఒకే కథ ఫేమ్ నివేత  పేతురాజ్ హీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

No comments