Featured Post

[TRENDING]

Tuesday, 15 January 2019

మహేష్ బాబు మహర్షి రిలీజ్ ఎప్పుడు??

author photo

మహర్షి రిలీజ్ ఎప్పుడు??



సూపర్ స్టార్  మహేష్ బాబు, బృందావనం, ఊపిరి లాంటి హిట్ చిత్రాల దర్శకుడు  వంశీపైడిపల్లి కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా మహర్షి. మహేష్ బాబు స్టూడెంట్ గా కనిపించనున్న  ఈ సినిమా షూటింగ్  ఇప్పటికే చాలా  పూర్తయింది. మహేష్ బాబు కు ఫ్రెండ్ గా అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్ర కూడా చేస్తున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్లను డెహ్రాడూన్ లో షూట్ చేసారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో అమెరికాలో పెద్ద బిజినెస్ టైకూన్ గా మహేష్ బాబు కనిపిస్తాడు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో  ఇండియాలోని పల్లెకు వచ్చి తన ఫ్రెండ్ కు అండగా నిలబడి ఆ ఊరి రైతుల కోసం పోరాటం చేస్తాడు. ఈ రోజుల్లో అందరూ దండగ అనుకుంటున్న వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి చూపిస్తాడు ఇది స్థూలంగా మహర్షి కథ.

సినిమాలో వచ్చే విలేజ్ సీన్స్ కోసం  రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేసి అక్కడ చాలా రోజులుగా షూట్ కూడా చేస్తున్నారు. ఓ భారీ పాట కూడా చిత్రీకరించేసారు. ఇంత ఫాస్ట్ గా చేస్తున్నా, ఇంకా ఈ సినిమా  విడుదల డేట్ మీద ఒక క్లారిటీ రావడం లేదు. అసలే మహేష్ బాబు లాంటి పెద్ద హీరో సినిమా అది కూడా భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత వస్తున్న  సినిమా కావడంతో రిలీజ్ డేట్ పక్కగా వుండాలని దర్శక   నిర్మాతలు  చాలా 
మదనపడుతున్నరట.  చివరికి వ్యవహారం ఏప్రియల్ 19 లేదా 26 అనే రెండు డేట్ల మధ్య ఊగిసలాడుతోంది. అయితే ఓ పక్క ఈ డేట్స్ గురించి తెలిసి అటు  బయ్యర్ల సర్కిళ్లలో ఈ సినిమా ఎలా వుంటుంది ఏంటి అని గుసగుసలు మొదలయ్యాయి.

నిజానికి  సినిమా ఓవర్ బడ్జెట్ అవుతోందని ఒక టాక్ అయితే బాగా వినిపిస్తోంది. సూపర్ స్టార్ రేంజ్ కు అది అంత సమస్య కాకపోవచ్చు. కానీ సినిమా బాగా స్లో నెరేషన్ గా వచ్చిందని మరో టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమా మొత్తం పూర్తిచేసి, ఫైనల్ కట్ తరువాత అన్నివిధాలా చూసుకుని, అవసరమైతే రీషూట్ లు పెట్టుకుని, ఆ తర్వాతే విడుదలకు వెళ్లాలని చిత్ర యూనిట్  డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అందుకే దాదాపు సినిమాకు గుమ్మడికాయ కొట్టేసం అన్న తర్వాత కానీ డేట్ డిసైడ్ అవలేరని తెలుస్తోంది.  ముగ్గురు నిర్మాతలు  పివిపి, అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా మహర్షి సినిమాని నిర్మిస్తున్నారు అయితే  కేవలం దిల్ రాజు మాత్రమే అన్నీ చూసుకుంటున్నారనీ మిగిలిన వారు ఏదో అలా అలా చూస్తున్నారని టాక్. రాజు గారు ఆయన సినిమాల డేట్ ను చాలా పక్కాగా ప్లాన్ చేస్తారు. సినిమాని ఎప్పుడు రిలీజ్ చేద్దాం అని ప్లాన్ చేసినా కూడా ఇంచమించు ఇటు వారం, అటు రెండు వారాలు గ్యాప్ వుండేలా చూసుకుంటారు. అలాగే దగ్గరలో పోటీ వచ్చే సినిమాలు లేకుండా చూస్తారు. ఇలాంటి వ్యవహారాల వల్లే క మహర్షి సినిమా విడుదల డేట్ ను ఇంకా ఫిక్స్ కాకుండా చేస్తున్నాయని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.

This post have 0 Comments


EmoticonEmoticon

Next article Next Post
Previous article Previous Post

Advertisement