Featured Post

[TRENDING]

Friday, 18 January 2019

నాగార్జున నాగచైతన్య తాత మనవళ్ళంట!!

author photo

నాగార్జున నాగచైతన్య తాత మనవళ్ళంట!!




మనం సినిమా గుర్తుందా అందులో నిజ జీవితంలో తండ్రి కొడుకులు అయిన నాగార్జున నాగచైతన్య రివర్స్ లో నటించారు. అంటే నాగార్జున కొడుకు నాగచైతన్య తండ్రి. అలాగే నాగేశ్వర రావు కు తండ్రిగా నాగార్జున నటించారు. కొత్త రకమైన కథ తో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అక్కినేని నాగేశ్వరావు గారి చివరి చిత్రం కావడంతో ఆయన అభిమానులు తెలుగు సినీ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు. అయితే ఇప్పుడు మనం సినిమా లో జరిగిన మ్యాజిక్ లాగానే మళ్ళీ ఇంకొకసారి నాగార్జున నాగచైతన్య  లు మ్యాజిక్ చేయబోతున్నారు.


ఎలాగా అంటారా రెండు సంవత్సరాల క్రితం సంక్రాంతికి రిలీజ్ అయిన నాగార్జున సినిమా సోగ్గాడే చిన్ని నాయన గుర్తుందా అందులో నాగార్జున పాత్ర శత్రువుల చేతిలో చనిపోయి పైన యమధర్మరాజుతో గొడవ పడి తన వాళ్లకి సాయం చేయడానికి మళ్లీ ఆత్మ రూపంలో కిందికి వస్తాడు. తన కొడుకు  కాపురాన్ని చక్కదిద్ది తనను అన్యాయంగా చంపిన శత్రువుల మీద పగ తీర్చుకొని మళ్ళీ పైకి వెళ్లి పోతాడు. అయితే ఇప్పుడు సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు అనే సినిమా రాబోతుంది. ఈసారి నాగార్జున కు  నాగచైతన్య కొడుకు గా పుట్టడం  అతనికి ఏదో సమస్య రావడంతో ఈ సారి పైన ఉన్న అతని తాత నాగార్జున మళ్లీ కిందికి రావడంతో కథ మొదలవుతుంది అంట. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది సినిమాలో చూడొచ్చు. మనం సినిమా తో తమ నిజ జీవిత పాత్రలను రివర్స్ చేసుకుని ప్రేక్షకులను అలరించిన నాగార్జున నాగ చైతన్య ఈసారి కూడా ఎలా అలరిస్తారో    చూడాలి. సోగ్గాడే చిన్నినాయన సినిమాకి దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ నే దీనికి దర్శకత్వం వహించ బోతున్నాడు. 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

This post have 0 Comments


EmoticonEmoticon

Next article Next Post
Previous article Previous Post

Advertisement