Header Ads

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ కొత్త అసెంబ్లీ కొలువుదీరే సమయం రావడంతో కొత్త శాసనసభ స్పీకర్ ఎన్నిక జరిగింది. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి ని ఈసారి స్పీకర్ పదవి వరించింది. పార్టీలో చాలా సీనియర్ అవ్వడం రాష్ట్ర స్థితిగతుల మీద బాగా అవగాహన ఉండడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఈ స్పీకర్ పదవి సరిపోతుందని భావించి ఆయనను సెలెక్ట్ చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి నిజామాబాద్ జిల్లా  బాన్స్ వాడ ప్రాంతానికి చెందినవారు ఆయన మొదటిగా తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉంటు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు టీడీపీ  నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో కెసిఆర్ నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి చేరారు. అప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉంటూ కెసిఆర్ నాయకత్వంలో పని చేస్తూ చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో బాన్స్ వాడ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ప్రభుత్వంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 
అసెంబ్లీలో పాలకపక్షానికి చెందిన సమర్థత కలిగిన వ్యక్తి స్పీకర్ గా ఉండాల్సి రావడం తో కేసీఆర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కి ఈ అవకాశాన్ని కలిగించారు. నిన్న జరిగిన స్పీకర్ ఎన్నికల్లో వేరే ఏ పార్టీ నుంచి అభ్యర్థులు నామినేషన్ లేకపోవడంతో పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత సాయంత్రం సభలో శాసనసభ స్పీకర్‌గా శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ శ్రీ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ప్రకటించారు. సీఎం శ్రీ కేసీఆర్, ఎమ్మెల్యేలు శ్రీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, శ్రీ ఈటల రాజేందర్‌, శ్రీ అహ్మద్‌ బలాలా నూతన సభాపతిని అధ్యక్ష స్థానానికి తోడ్కొని వెళ్లారు. ఆ తర్వాత తాత్కాలిక సభాపతి నుంచి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సభలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుతో మొదలుకొని పలువురు శాసనసభ్యులు నూతన సభాపతికి శుభాకాంక్షాలు, అభినందనలు తెలుపుతూ ప్రసంగించారు.

No comments