Header Ads

భారత రత్న విజేతలు వీరే

భారత రత్నాలు వీరే                                           image credited from naidunia.jagran.com

భారత దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఈ ఏడాది ముగ్గురు ప్రముఖులను వరించింది వారిలో ప్రముఖంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ నేత నానాజీ దేశ్ముఖ్ అలాగే గాయకుడు భూపేన్ హజారికా లకు ఈ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రకటించింది. వీరిలో నానాజీ హజరికా పేర్లను వారి మరణానంతరం ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వంఅధికార ప్రకటనలో పేర్కొంది.  ఇండియాలో అత్యున్నత పురస్కారం అయిన ఈ భారతరత్నను కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా 2015 లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి అలాగే బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు మదన్ మోహన్ మాలవీయ లకు వీటిని ప్రధానం చేసింది. దాంతో ఇప్పటి వరకు భారతదేశంలో ఈ అవార్డును పొందిన వారి సంఖ్య 48 కి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 11మంది విదేశీయులతో పాటు 112 మంది ప్రముఖులకు వారు చేసిన సేవలకు గాను పద్మ పురస్కారాలను ప్రకటించింది. నలుగురికి పద్మవిభూషణ్ 14 మందికి పద్మభూషణ్ 94 మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.


పద్మభూషణ్ అందుకున్న అవార్డు గ్రహీతలు:


మలయాళ నటుడు మోహన్ లాల్ తాను చేయని తప్పుకు తప్పుడు కేసుల్లో ఇరుక్కుని చివరికి సుప్రీం కోర్టు ద్వారా నిర్దోషిగా విడుదల అయిన అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణన్ దివంగత ప్రముఖ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ లోక్సభ మాజీ డిప్యూటీ స్పీకర్ ప్రస్తుత ఎంపీ కరియా    ముండా భాజాపా ఎంపి కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి హుకుమ్ దేవ్ నారాయణ్ యాదవ్ అకాలీ దళ్ నేత సుఖ్ దేవ్ సింగ్ దిండ్సా ఎం డి హెచ్ మసాలా వ్యవస్థాపకులు సీఈఓ మహాశయా ధర్మ పాల్ పర్వతారోహకులు బచేంద్రిపాల్ మాజీ కాగ్ వి కే షుంగ్లా లకు పద్మభూషణ్ అవార్డులు దక్కాయి.

పద్మశ్రీ లు అందుకున్న అవార్డు గ్రహీతలు:


తమిళ హీరో నృత్య దర్శకుడు నటుడు దర్శకుడు ప్రభుదేవా, దివంగత బాలీవుడ్ నటుడు ఖాదర్ ఖాన్ భారత క్రికెట్ క్రీడాకారుడు గౌతం గంభీర్ మాజీ రాయబారి జయశంకర్ లకు పద్మశ్రీ అవార్డు దక్కింది.

పద్మ అవార్డును పొందిన తెలుగువారు:


తెలంగాణ రాష్ట్రం నుంచి భారత జాతీయ ఫుట్బాల్ జట్టుకు ఎంపిక కెప్టెన్ గా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ఆటలో ఆసియా వ్యాప్తంగా అత్యధికంగా సాధించిన సునీల్ ఛెత్రి, సినీ గేయ రచయిత సిరివెన్నల సీతారామ శాస్త్రి, చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, రైతు నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పాత్రికేయుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావు లకు పద్మశ్రీ అవార్డు దక్కింది.

ఏ రాష్ట్రాలకు ఎన్ని  అవార్డులు:

మొత్తం 112 పద్మ పురస్కారాల్లో మహారాష్ట్రకు అత్యధికంగా 12 అవార్డులు దక్కాయి. ఉత్తర ప్రదేశ్ కు 10 ఢిల్లీకి 8 తమిళనాడుకు 7 గుజరాత్ కు 6 మధ్యప్రదేశ్ 4 కేరళ కర్ణాటక బీహార్ హర్యానా లకు 5 జార్కండ్ కు 4, ఒడిశా పంజాబ్ ఉత్తరాఖండ్ పశ్చిమబెంగాల్ జమ్మూ కాశ్మీర్ లకు 3, హిమాచల్ ప్రదేశ్ చత్తీస్ గడ్ లకు 2 మణిపూర్ సిక్కిం త్రిపుర లకు 1 అలాగే విదేశీయుల్లో అమెరికాకు 6 దక్షిణాఫ్రికాకు 1 జర్మనీకి 1 కెనడాకు 1 ఫ్రాన్స్ డిజిబౌటి    ఒకటి చొప్పున లభించాయి.

No comments