నాని సినిమా లో ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ

Business

నాని సినిమా లో ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ

నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక కొత్త సినిమా ఈ రోజు ఓపెనింగ్ జరుపుకుంది. ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ గా రాబోతున్న ఈ సినిమాలో 5 గురు హీరోయిన్ లు నాని సరసన నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర కు ఆర్  ఎక్స్ 100 హీరో కార్తీ కేయ ను తీసుకున్నారు. నాని కి మంచి పోటీ ఇచ్చే పాత్ర అని సినిమాలో కీలకంగా ఉంటుంది అని తెలుస్తుంది. ఈ మధ్య ఫ్లాప్ లలో ఉన్న నాని విక్రమ్ కుమార్ జతకట్టి సినిమా చేస్తున్నారు. నాని జర్శి సినిమా తర్వాత ఇది రిలీజ్ అవబోతుంది. 24, మనం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత విక్రమ్ కుమార్ నుంచి పెద్ద హిట్ సినిమాలు ఏవి రాలేదు రీసెంట్ గా అఖిల్ తో హలో సినిమా తీసినా కూడా అది బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత విజయాన్ని సొంతం చేసుకొలేక పోయింది. దాంతో కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు నాని తో జత కట్టి వస్తున్నాడు విక్రమ్ ఈసారైనా హిట్ కొడతాడా లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ కొరకు వేచి చూడాలి.

Post a Comment

0 Comments