Header Ads

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి


జమ్మూ కాశ్మీర్ మరోసారి ఉగ్రవాదుల దాడితో రక్తమోడింది. కుటుంబ సభ్యులతో సరదాగా సెలవులు గడిపి ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ విధుల్లోకి తిరిగి వస్తున్న సిఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపైకి ఉగ్రవాదుల కార్ దూసుకొచ్చి 39 మంది జవాన్ల ప్రాణాలను బలితీసుకుంది. పాకిస్థాన్ గడ్డపై బలం పెంచుకున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి పాల్పడింది. 2001లో జమ్మూకాశ్మీర్ శాసనసభ పై కారు బాంబు దాడి తరువాత ఆ తరహా దాడి జరగడం ఇదే మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా రాజకీయ అగ్ర నేతలంతా ఖండించారు. భద్రతా దళాల త్యాగాలు వృధాగా పోవని ప్రధాని స్పష్టం చేశారు   పుల్వామా జిల్లాలో శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిపై ఈ ఘాతుకం జరిగింది గురువారం సాయంత్రం మూడు గంటల పదిహేను నిమిషాల సమయంలో 2500 మంది మంది ఉన్న జవాన్లు 78 వాహనాల్లో జమ్ము నుంచి బయలుదేరారు సూర్యాస్తమయంలో గారు చేరుకోవాల్సి ఉంది వీరిలో అనేక మంది తర్వాత తిరిగి కాశ్మీర్లో విధుల్లో చేరేందుకు వస్తున్నారు. శ్రీ నగర్ కు ఇరవై కిలోమీటర్ల దూరంలో అవంతీపుర లోని లతో వద్దకు వాహనాన్ని చేరుకోగానే పేలుడు పదార్థాలతో నిండిన ఒక వాహనం వేగంగా దూసుకొచ్చింది కాన్వాయ్ లోని ఒక బస్సును ఢీ కొట్టింది ఫలితంగా బస్సు తునాతునకలైంది ఈ వాహనంలో సిఆర్పిఎఫ్ బెటాలియన్ కు చెందిన 39 నుంచి 44 మంది జవాన్లు ఉన్నారు మదిలోని పలువురు అక్కడికక్కడే మరణించారు పదుల సంఖ్యలో జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు వారిని హుటాహుటిన శ్రీనగర్లోని సైన్యానికి చెందిన 92 బేస్ ఆస్పత్రికి తరలించారు. కనీసం 39 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి అయితే బస్సులోని వారెవ రూ బతక లేదని ఒక అధికారి చెప్పారు ఆ వాహనంలో నిర్దిష్టంగా ఎంత మంది జవాన్లు ఉన్నారన్నది ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు. పేలుడు తర్వాత తుపాకీ కాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసులు చెప్పారు దీన్నిబట్టి సమీపంలో కొందరు ఉగ్రవాదులు మాటువేసి కాల్పులు జరిపి ఉంటారని భావిస్తున్నారు. పేలుడు తీవ్రతకు వాన సోనీ లోని ఇతర వాహనాలు కూడా దెబ్బ తిన్నాయి ఆ ఘటన జరిగిన వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి read more

ఈ దాడికి పాల్పడింది తానేనంటూ జైషే మహ్మద్ ఉగ్రవాది సంస్థ ప్రకటించింది ఇందులో పాల్గొన్న ఆత్మాహుతి దళ సభ్యు డిని పుల్వమా జిల్లాలోని కాకాపొర కు చెందిన అదిల్ దార్ అలియాస్ వాకాస్ కమాం డో గా గుర్తించారు. గత ఏడాదే ఇతడు ముఠాలో చేరాడు తాజా దాడిలో 100 కిలోలకు పైగా పేలుడు పదార్థాలను వాహనంలో నింపుకూని వచ్చాడు.

సాధారణంగా ఒక వాహనశ్రేణిలో దాదాపు వెయ్యిమంది జాతర చేస్తారు అయితే రెండు మూడు రోజులుగా వాతావరణం సరిగా లేకపోవడం, పాలనా పరమైన కారణాలవల్ల ఈ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దీనివల్ల గురువారం ఒకేసారి 2547 మంది జవాన్ లను తరలించాల్సి వచ్చింది అని అధికారులు తెలిపారు. వాహన శ్రేణి బయలుదేరడానికి ముందు భద్రత బృందం ఆ మార్గంలో తనిఖీలు చేసింది వాహనశ్రేణిలో ఉగ్రవాద దాడి నీ తిప్పికొట్టే సాయుధ వాహనాలు ఉన్నాయి. అయినా దాడి జరగడం చర్చనీయాంశం అయింది. Read more News

No comments