dailymotion-domain-verification=dmcxvoo0ku31parka google.com, pub-7019376976432612, RESELLER # video

వైష్ణవ తేజ్ సినిమాలో విలన్ గా తమిళ్ హీరో విజయ్ సేతుపతి

సుకుమార్ రైటింగ్స్ పతాకంపై హీరోగా పరిచయమవుతున్న వైష్ణవ తేజ్ సినిమాలో ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తారనే వార్త సినిమా సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. సాయి ధరంతేజ్ తమ్ముడిగా అటు చిరంజీవి మేనల్లుడు గా వైష్ణవ తేజ్ సినిమా కి ఇప్పటికే చిన్న హైప్ స్టార్ట్ అయింది ఈ సినిమాకి ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లు కూడా పని చేస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నీ తీసుకుంటున్నారనే సమాచారం ఈ సినిమా మీద మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది. పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో ఉండబోతున్న ఈ సినిమాలో ఒక కొత్త పాయింట్ టచ్ చేశారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహ రెడ్డి లాంటి భారీ చిత్రంలో ఒక పాత్ర చేస్తున్న విజయ్ సేతుపతి మళ్లీ ఇప్పుడు మరో తెలుగు సినిమా కూడా ఒప్పుకోవడంతో ఇక మీదట తనకి తెలుగులో అవకాశాలు పెరుగుతాయని చెప్పొచ్చు.
వైష్ణవ తేజ్ సినిమాలో విలన్ గా తమిళ్ హీరో విజయ్ సేతుపతి వైష్ణవ తేజ్ సినిమాలో విలన్ గా తమిళ్ హీరో విజయ్ సేతుపతి Reviewed by cinemarascals on February 17, 2019 Rating: 5

No comments

rubiconproject.com, 8769, RESELLER, 0bfd66d529a55807 # video google.com, pub-7019376976432612, RESELLER # video