Header Ads

అభినందన్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు??


Abhinandan in custody of pak army
పుల్వమా ఘటన తర్వాత భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న భుబాగంలో టెర్రరిస్ట్ క్యాంప్ ల మీద దాడులు చేసినప్పుడు అనుకోకుండా ఒక భారత మిగ్ యుద్ద విమానం కూలిపోయింది దాని పైలెట్ అనూహ్యంగా పాక్ కు యుద్ధ ఖైదీగా చిక్కాడు అయితే ఇప్పుడు పాక్ భూతలంలో కూలిన మిగ్ విమానం పైలెట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం వంద కోట్ల మంది భారతీయుల మదిని తొలుస్తున్న ప్రశ్న ఇది. జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలను భారత ఎయిర్ ఫోర్స్ చిన్నాభిన్నం చేసిందన్న ఆనందాన్ని ఆస్వాదిస్తున్నామన్న వేళ అభినందన్ పట్టుబడిన విషాదం ఆవిరి చేసింది. అంతే కాకుండా పట్టుబడ్డ అభినందన్ ను పాకిస్తానీయులు హింసిస్తున్న వీడియో మనసును కలిచివేస్తుంది. అంత విషాదంలో కూడా పాక్ రిలీజ్ చేసిన వీడియో లో అభినందన్ గుండె ధైర్యాన్ని చాలామంది మెచ్చుకుంటున్నారు. పాక్ ఆర్మీ అధికార్లు అడిగిన ప్రశ్నలకు అతను సమాధానాలు చెప్పిన విధానం తన దేశ రహస్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్ప నని అనడం ఇవన్నీ తనలోని అసలైన జావాన్ దేశ భక్తి దేశం పట్ల అంకితభావం నిబద్ధత ఇవన్నీ కనిపించాయి. కానీ ఇప్పుడు ప్రతి భారతీయుడు కోరుకుంటుంది ఒక్కటే ఏదేమైనా అభినందన్ ను సురక్షితంగా భారత్ కు తీసుకురావాలి అదే నిజమైన విజయం. అది సాధ్యం అవుతుందా? లేదా అనేది వేచి చూడాలి.

నిజానికి మొదటి, రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ దేశాలన్నీ కలిసి చేసుకున్న జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీలకు మరణశిక్ష విధించకూడదు. ఒకవేళ గాయాలతో యుద్ధ ఖైదీలు దొరికతే వారికి వైద్య సాయం కూడా అందించాలని జెనీవా ఒప్పందం చెబుతోంది. అయితే ఈ ఒప్పందానికి పాక్ ఎంతవరకూ కట్టుబడుతుంది అనేది ప్రశ్న ఇప్పటికే అభినంద న్ తీవ్రంగా హింసించారు కానీ ఆ తర్వాత మళ్లీ బాగానే చూసారు అయితే అదే కంటిన్యూ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే అభినందన్ ను చిత్రహింసలు పెట్టిన వీడియోనే బయటకు వచ్చింది. ఆయనను మరింత ఇబ్బందిపెట్టే అవకాశాలు లేకపోలేదు. భారత్ కు సంబంధించిన వైమానిక రహస్యాలను బయటపెట్టమని శత్రు దేశ అధికారులు అభినందన్ ను వేధించే అవకాశాలున్నాయి. ఇదివరకూ కార్గిల్ యుద్ధ సమయంలో ఒక పైలెట్ సజీవంగా దొరకగా.. అతడిని పాక్ చిత్ర హింసలకు గురిచేసిన ఉదంతాన్ని భారత అధికారులు గుర్తుచేస్తున్నారు కూడా ఇప్పుడు ఆ ఘటన పునరావృతం అవుతుందని భయపడుతున్నారు.

దేశ రహస్యాలను చెప్పమని ఆయనను హింసించారు.కానీ అతడు స్థైర్యంతో నిలిచాడు. పాక్ చిత్ర హింసలతో ఏ రోజుకు ఆరోజు అదే చివరిరోజు అనిపించేదని సదరు పైలెట్ చెప్పడం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ టైమ్ లో వాజ్ పేయి ప్రభుత్వం దౌత్యపరమైన ఒత్తిడిని పాక్ మీద విపరీతంగా తీసుకువచ్చింది. దాని ఫలితమే ఇస్లామాబాద్ లోని భారత హై కమిషనర్ ఆ విషయంలో చొరవ చూపి… ఆ భారతీయుడిని సురక్షితంగా తీసుకువచ్చారు. ఇప్పుడు అభినందన్ విషయంలో మోడీ ప్రభుత్వం అదేస్థాయి దౌత్యాన్ని నడపాల్సిన అవసరం ఉంది. వీలైనంత త్వరగా ఆ వింగ్ కమాండర్ ను సురక్షితంగా ఇండియాకు తీసుకువస్తే అదే పెద్ద విజయం అవుతుంది. దీనికోసం మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రశ్నార్థకం ప్రస్తుతానికి.

ఈ తరుణంలో దేశ ప్రజలు అలాగే యుద్ధం రావాలి అని కోరుకునే వారు గమనించాల్సిన మరో అంశం యుద్ధం అంటే మాటలు మాట్లాడినంత సులభంకాదు, ఏమాత్రం తేడా వచ్చినా అసలుకే ఎసరు వస్తుంది. యుద్ధం వల్ల నాశనమే కానీ అభివృద్ధి ఉండదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.


No comments