Header Ads

వైయస్ జగన్ ను కలిసిన సినీ హీరో నాగార్జున

వైయస్ జగన్ ను కలిసిన సినీ హీరో నాగార్జున


nagarijuna meet ys jagan
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ సినీ హీరో నాగార్జున ఈరోజు లోటస్ పాండ్ లోని ఆయన నివాసంలో కలిశారు.

ఇద్దరి మధ్య సుమారు అరగంటపాటు చర్చలు జరిగాయని తెలుస్తుంది. అయితే వైయస్ జగన్ ని కలిసిన అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే సినీ హీరోయిన్ నాగార్జున పొలిటికల్ లీడర్ అయిన జగన్ ని అది ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నాగార్జున ముందు నుంచి కూడా రాజకీయాల మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు కొన్నేళ్ల నుంచి కూడా నాగార్జున పొలిటికల్ విషయాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు కేవలం ఆయన తన సినిమా తన కొడుకు ల సినిమాల గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడుతుంటారు జస్ట్ జరిగినప్పుడు మాత్రం వచ్చి ఆయన ఓటు హక్కును వినియోగించుకునే వెళ్తూ ఉంటారు.

2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా నాగార్జున తన అభిప్రాయాల్ని బయటకి చెప్పలేదు చిరంజీవికి బహిరంగంగా గాని పరోక్షంగా గాని తన మద్దతును కూడా తెలపలేదు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టినప్పుడు కూడా నాగార్జున నుంచి ఎలాంటి స్పందన బయటకు రాలేదు. కొన్ని సంవత్సరాల క్రితం వరస ప్లాప్ సినిమాలతో నాగార్జున తన కెరీర్లో సతమతమైన ఇప్పటికీ ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయన లాంటి భారీ హిట్ సినిమాతో మళ్లీ గాడిలో పడ్డాడు నుంచి ఆయన సోలోగా అటు మల్టీ స్టార్ సినిమాలు కూడా చేస్తూ కెరీర్లో చాలా బిజీగా ఉంటు వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా నాగార్జున తన స్పందనను బయటకి పెద్దగా చెప్పలేదు రాష్ట్రం విడిపోయిన కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటికి కలిసే ఉండాలని ఉంటుందనీ ఆయన తన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కొన్ని నెలల్లో 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నాగార్జున వైయస్ జగన్ నీ కలవడం అటు సినీ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని గుంటూరు నుంచి ఎంపీగా పోటీ కూడా చేయబోతున్నారని కొన్ని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి కానీ ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది కేవలం జగన్ ని కలిసినంత మాత్రాన నాగార్జున ఆయన పార్టీలో చేరుతున్నారని అనుకోవడం కూడా తప్పే అవుతుంది.
అయితే ఇలా ఎన్నికల వేళ సినీతారలు పొలిటికల్ లీడర్స్ ను కలవడం అన్నది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఆ మధ్య ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అలీ లాంటి వాళ్లు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారని జనసేన పార్టీ నుంచి పోటీ కూడా చేయబోతున్నారు అనే ప్రచారం కూడా బాగా జరిగింది తర్వాత అవన్నీ పుకార్లుగానే కొట్టిపారేశారు. రీసెంట్ గా ప్రముఖ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అఫిషియల్ గా జాయిన్ అయ్యి రీసెంట్ గా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద ఆయా నేతల మీద బాగా ఘాటుగానే విమర్శలు చేస్తూ వార్తల్లో ఉంటూ వస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే సీటు గాని ఎంపీ సీటు గాని కూడా దక్కుతుంది అని బాగా ప్రచారం జరుగుతుంది. ఆనాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ వరకు కూడా సినీ తారల రాజకీయ ప్రస్థానం అనేది ఎప్పుడూ అనూహ్యంగా జరుగుతూ వస్తూనే ఉంది సమాజ సేవ చేయాలన్న తలంపుతో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం తమిళనాడులో కూడా రజనీకాంత్ కమల్ హాసన్ లాంటి అగ్ర నటులు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చేశారు. సినీ తారలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తమ తమ అదృష్టాలను పరీక్షించుకోవడం కూడా మామూలు విషయమే. ఇప్పుడు నాగార్జున వైయస్ జగన్ భేటీ కూడా హాట్ టాపిక్ గా మారింది.

No comments