dailymotion-domain-verification=dmcxvoo0ku31parka google.com, pub-7019376976432612, RESELLER # video

నాని విక్రమ్ కుమార్ సినిమా టైటిల్ గ్యాంగ్ లీడర్??


Pilla Zamindar Nani Handsome Stills




గ్యాంగ్ లీడర్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం ఈ సినిమా పాటలు డాన్స్ ఫై ట్స్ ఇవన్నీ చిరంజీవి క్రేజ్ ను పీక్స్ కు తీసుకెళ్ళాయి. ఆయన కెరీర్ లో అతి పెద్ద హిట్స్ లో ఈ సినిమా ఖచ్చితంగా వుంటుంది. పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ సాయి ధరమ్ తేజ్ ఇలా ప్రతీ మెగా హీరో ఈ టైటిల్ తో సినిమా చేస్తారనీ కొన్ని సార్లు చరణ్ ఈ సినిమానే మళ్ళీ రీమేక్ చేస్తారని చాలా వార్తలు వచ్చాయి కానీ అవేవీ కార్య రూపం దాల్చలేదు అయితే ఇప్పుడు మళ్లీ ఈ టైటిల్ వార్తల్లోకి వచ్చింది ఎందుకు అంటారా ఇప్పుడు ఈ టైటిల్ ను నాచురల్ స్టార్ నాని వాడేస్తున్నా డని టాక్… డైరక్టర్ విక్రమ్ కుమార్ తో హీరో నాని చేస్తున్న సినిమాకు ఈ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.













నాని బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ వస్తుందని కథా ప్రకారం దీనికే మేకర్స్ ఫిక్స్ అయ్యారు అని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ ఒకటి నడుస్తుంది. మామూలుగా విక్రమ్ కుమార్ అన్నా, నాని అన్నా గ్యాంగ్ లీడర్ లాంటి టైటిల్ ను అస్సలు గెస్ ఎవరు చేయరు ఆ మాటకొస్తే అసలు విక్రమ్ కుమార్ టైటిళ్లే 13B, 24, మనం, హలో ఇలా చాలా డిఫరెంట్ గా వుంటాయి. ఇక నాని సినిమా టైటిల్స్ అయితే చాలా నార్మల్ గా అందరికీ అర్థం అయ్యేలా కొంచం టీజ్ చేసినట్లుగా వుంటాయి. కానీ ఇప్పుడు అలాంటి డైరక్టర్, నానితో కలిసి చేస్తున్న సినిమాకు గ్యాంగ్ లీడర్ అనే ఈ క్రేజీ టైటిల్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రేపు కనుక గ్యాంగ్ లీడర్ టైటిల్ అనౌన్స్ మెంట్ వస్తే, నాని ఫ్యాన్స్ పండగ చేసుకోవడం గ్యారంటీ. ఎందుకంటే నాని లాంటి హీరోకి మాంచి మాస్ టైటిల్ దొరకడం ఇదే ఫస్ట్ టైమ్ అవుతుంది మరి.


నాని విక్రమ్ కుమార్ సినిమా టైటిల్ గ్యాంగ్ లీడర్?? నాని విక్రమ్ కుమార్ సినిమా టైటిల్ గ్యాంగ్ లీడర్?? Reviewed by cinemarascals on February 23, 2019 Rating: 5

No comments

rubiconproject.com, 8769, RESELLER, 0bfd66d529a55807 # video google.com, pub-7019376976432612, RESELLER # video