Featured Post

[TRENDING]

Tuesday, 19 February 2019

మళ్ళీ సినిమాల్లోకి రేణు దేశాయ్ రీ ఎంట్రీ

author photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య తెలుగులో మళ్ళీ రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది ఆమే రేణుదేశాయ్‌. ఇటీవల తాను ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించేసింది. బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లం కొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాతో రేణుదేశాయ్‌ రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. పవన్‌ సరసన 'బద్రి', 'జానీ' సినిమాల్లో నటించిన రేణుదేశాయ్‌ ఆ తర్వాత నటనకు పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే. పవన్‌కళ్యాణ్‌తో సహజీవనం, పెళ్ళి, ఆ తర్వాత విడాకులు.. ఇటీవలే మళ్ళీ పెళ్ళికి రేణుదేశాయ్‌ సిద్ధమవడం కూడా అందరికీ తెలిసిన విషయాలు.









అయితే ఈ మధ్యనే ఓ డాన్స్‌ షో ద్వారా బుల్లితెర ఎంట్రీ కూడా ఇచ్చిన రేణుదేశాయ్‌, మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధమవడం విశేషమే. ఎందుకంటే రేణుదేశాయ్‌ పెదవి విప్పితేచాలు, ఘాటైన విమర్శలతో విరుచుకుపడిపోతుంటారు పవన్‌కళ్యాణ్‌ అభిమానుల పేరుతో కొందరు వ్యక్తులు మరి అలాంటిది ఇప్పుడు ఏకంగా రేణుదేశాయ్‌ సిల్వర్‌ స్క్రీన్‌ రీ-ఎంట్రీ ఇస్తే వాళ్లంతా ఇంకెంతలా రెచ్చిపోతారో ఏమో చూడాలి ఎవరిగోల ఎలావున్నా, రేణుదేశాయ్‌ మాత్రం తిరిగి మళ్ళీ సినిమాల్లో నటించాలనే తన కోరికను తీర్చుకోబోతోంది.





కాగా రేణు దేశాయ్ నటించనున్న సినిమా విషయానికి వస్తె ప్రముఖ సంఘ సంస్కర్తగా పేరొందిన హేమలత లవణం పాత్రలో రేణుదేశాయ్‌ నటిస్తోంది. గుర్రం జాషువా కుమార్తె అయిన హేమలత లవణం, రచయిత్రిగానూ పేరు ప్రఖ్యాతులు పొందారు. అంటరానితనానికి వ్యతిరేకంగా నినదించారామె. అలాంటి పాత్రలో రేణుదేశాయ్‌ నటించడమంటే ఖచ్చితంగా మంచి అంచనాలే వుంటాయి. సినిమాల్లో తన రీ ఎంట్రీ విషయాన్ని స్వయంగా రేణుదేశాయ్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించింది. 'దొంగాట' ఫేం వంశీకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. సినిమాల్లో మళ్ళీ నటించాలన్న కోరిక ఇలా తీరుతోందనీ, ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్స్‌ చెబుతున్నాననీ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో పేర్కొంది రేణుదేశాయ్‌.





రేణుదేశాయ్‌కి సైతం కవితలంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇంగ్లీషులో తాను రాసిన కవితల్ని తెలుగులోకి ఇటీవల తర్జుమా చేయించుకున్నారామె. ప్రముఖ సినీపాటల రచయిత అనంత్‌ శ్రీరామ్‌, రేణుదేశాయ్‌ ఇంగ్లీషు కవితల్ని తెలుగులోకి అనువదించాడు.


This post have 0 Comments


EmoticonEmoticon

Next article Next Post
Previous article Previous Post

Advertisement