Header Ads

నాని శర్వానంద్ ఆ రోజే వస్తారంట!!


న్యాటురల్ స్టార్ నాని, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్, కాన్సెప్ట్ ప్రకటన నిన్ననే హీరో నాని బర్త్ డే కానుకగా గ్యాంగ్ లీడర్ విడుదల మంత్ కూడా ప్రకటించేసారు. ఆగస్టులో విడుదలవుతంది అ ని చెప్పారు సో నాని ఇప్పటికే ఏప్రియల్ లో జెర్సీ ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమా రాబొతోంది. అంటే నాని ఈసారి మూడునెలల గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్ చేయబతున్నాడన్నమాట. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది అదేంటంటే అటు నాని కానీ ఇటు విక్రమ్ కుమార్ కానీ గతంలో ఎప్పుడూ తమ సినిమాల విడుదలను ఇంత ఖచ్చితంగా ప్రకటించలేదు. మరి అలాంటిది ఇప్పుడు ఇంత హడావిడిగా రిలీజ్ మంత్ కూడా చెప్పేశారు అన్నదే బిగ్గెస్ట్ క్వశ్చను. ఒకవేళ ఇతర హీరోలకు అంత ఛాన్స్ ఇవ్వకూడదు అనుకున్నారా లేదా ఒక ఖచ్చితమైన ప్లాన్ తో సినిమా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు అన్నది తెలియాలి.

పోనీ నాని ఆగస్ట్ కు ఫిక్స్ అయ్యాడు కానీ తనకు పోటీ ఏది లేదా అనుకుంటే ఆగస్టు 15న ప్రభాస్ భారీ సినిమా సాహో విడుదల అవుతోంది. సో అందువల్ల దానికి వారంముందుగా అంటే ఆగస్టు 9న అయితే నాని సినిమా రిలీజ్ చేసే సాహసం అయితే చేయరు. అలాగే సాహో వచ్చిన వారానికి కూడా వదలడం కూడా రిస్క్ ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత వస్తున్న ప్రభాస్ ఫస్ట్ సినిమా ఇదే… అందులోనూ ప్రభాస్ లాంటి భారీ హీరో సినిమా అంటే దాని ఎఫెక్ట్ మినిమం రెండు మూడు వారాలు వుంటుంది(మరీ డిజాస్టర్ అయితే తప్పా) ఇక మిగిలిన డేట్ లు ఏవీ అంటే అవి రెండే ఆగస్టు 2 లేదా 30. అయితే ఇక్కడ నాని-విక్రమ్ కుమార్ సినిమాను ఆగస్టు 29 గురువారం విడుదల చేయబోతున్నారని ఇది ఫిక్స్ అని తెలుస్తోంది.

Sharwanand samantha 96 remake

ప్రభాస్ నాని లే అనుకుంటే ఇక్కడ ఆగస్ట్ లో మళ్ళీ శర్వానంద్-సమంతల కాంబినేషన్ లో నిర్మాత దిల్ రాజు నిర్మించే 96 రీమేక్ ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మ్యాటర్ ఇంకా బయటకు రాలేదు కానీ, ఇండస్ట్రీ సర్కిళ్లలో మాత్రం ఇప్పటికే వినిపించింది. అందుకే నాని విక్రమ్ కుమార్ సినిమాకు ముందు జాగ్రత్త చర్యగా ఇలా రిలీజ్ మంత్ ప్రకటించి వదిలినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి ఇక ఆగస్టులో డేట్ లు అయిపోయినట్లే అనుకోవాలి. కచ్చితంగా రాజు గారు 96కు వేరే డేట్ వెదుక్కోవాల్సిందే.

ఈ సమీకరణాలు అన్నీ కుదిరితే అంతా బాగానే వుంటుంది అందరూ తమ తమ సినిమాలు అనుకున్న టైమ్ కే రిలీజ్ చేసుకోవచ్చు కానీ విక్రమ్ కుమార్ చేసే సినిమాలకు ఎక్కువ టైమ్ తీసుకుంటారు అలాంటిది ఆయన తన సినిమాను ఆరునెలల్లో ఫినిష్ చేయగలరా అన్నదే ఇప్పుడు పెద్ద డవుట్. ఒకసారి ఆయన ట్రాక్ రికార్డు చూస్తే, సినిమాను కాస్త పద్దతిగా, సటిల్డ్ గా తీస్తూ వెళ్తారు. అయితే స్క్రిప్ట్ మీద అల్లు అర్జున్ క్యాంప్ లో వుండి చాలాకాలం స్పెండ్ చేసారు కాబట్టి, మిగిలిన పని ఫాస్ట్ గానే అయిపోతుందనే కాన్ఫిడెన్స్ వుండాలి. లేదంటే అంత ఖచ్చితంగా రిలీజ్ డేట్ ప్రకటించి వుండరు కదా.


No comments