కోడి రామకృష్ణ ఇక లేరు

Business

కోడి రామకృష్ణ ఇక లేరు


Kodi ramakrishna at an event




ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ ఈ రోజు కన్నుమూశారు. గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురి కాగా, కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటీన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ పలు తమిళ, మలయాళ, హిందీ సినిమాలను తెరకెక్కించారు. ఆయన తీసిన అమ్మోరు దేవి దేవి పుత్రుడు మంగమ్మ గారి మనవడు సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. హీరోయిన్ అనుష్క తో ఆయన తీసిన అరుంధతి సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ అనుష్క కి అలాంటి భారీ హిట్ రాలేదు. చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ లాంటి పెద్ద హీరోలతో కూ డా కోడి రామ కృష్ణ దర్శకత్వం లో చాలా సినిమాలు చేశారు. మసాలా కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రాలకు ఆయన పెట్టింది పేరు అలాగే అయిన ప్రయోగాత్మక సినిమాలకు కూడా దర్శకత్వం వహిస్తూ వచ్చారు. వంద చిత్రాలు తీసిన డైరెక్టర్ గా ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుల్లో ఒకరు. దాసరి నారాయణ రావు కోడి రామకృష కోదండరామిరెడ్డి రాఘవేంద్ర రావు ఇలా సీనియర్ దర్శకులు అందరూ వందకుపైనే చిత్రాలు తీసి వాటిలో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితోనూ ఆయన సినిమాలు రూపొందించారు.









2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు. పాలకొల్లు లో పుట్టి పెరిగిన కోడి రామకృష్ణ సినిమా మీద ఉన్న అభివృద్ధితో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఎంతో కష్టపడి అయిన డైరెక్టర్ గా ఎదిగారు. మొత్తం 10 నంది అవార్డులు 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఆయన అందుకున్నారు. దేవుళ్ళు అంజి అమ్మోరు దేవి పుత్రుడు లాంటి గ్రాఫిక్స్ ప్రధాన సినిమాలకు ఆయన పెట్టింది పేరు. 2012 లో రామకృష్ణ గారికి రఘుపతి వెంకయ్య అవార్డు కూడా వచ్చింది. అదే కాకుండా ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా సార్లు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలకు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును కూడా అందుకున్నారు. కోడి రామకృష్ణ గారు ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తున్న ఈ రోజుల్లో తలకు ఒక తెల్లటి గుడ్డ కట్టుకొని ఒక సపరేట్ స్టైల్ తో ఉండేవారు. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి ఏ సినిమా కూడా రాలేదు 2016 లో కన్నడ భాషలో తీసిన నాగాహారవు అనేది ఆయన చివరి సినిమా. కోడి రామకృష్ణ రూపంలో మరో ప్రతిభావంతమైన దర్శకుడు మీ తెలుగు సినిమా ఇండస్ట్రీ కోల్పోయింది. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని తెలుగు సినిమా రాస్కెల్స ప్రార్థిస్తుంది.


Post a Comment

0 Comments