ఆ ఏనిమిది నియోజక వర్గాల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గెలిచే ఛాన్స్ ఉందంట

Business

ఆ ఏనిమిది నియోజక వర్గాల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గెలిచే ఛాన్స్ ఉందంట

ఆ ఏనిమిది నియోజక వర్గాల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గెలిచే ఛాన్స్ ఉందంట!!!


పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాబోయే నాలుగు నెలల్లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ తరపున గట్టి అభ్యర్థులను రంగంలోకి దింపబోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు ఉన్నప్పటికీ జనసేన పార్టీ చాపకింద నీరులా రాష్ట్రమంతటా విస్తరిస్తూ తన ఉనికిని మెరుగుపరుచుకునే దిశగా ముందుకు సాగిపోతుంది. కళ్యాణ్ తన ప్రజాపోరాట యాత్ర ద్వారా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో చాలా నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు చేశారు. ముఖ్యంగా ఉపయోగంగా వరి జిల్లాల మీద పవన్ కళ్యాణ్ చాలా శ్రద్ధ పెట్టి మరి అక్కడ తమ పార్టీ బలోపేతం కావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటిలో ఉన్న కింది స్థాయి నాయకులను ఒకవేళ టికెట్ గనక ఇచ్చినట్లయితే అంతో ఇంతో పోటీ ఇవ్వగల అభ్యర్థులను కూడా జనసేన పార్టీ లోకి లాగడానికి తమ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ పోయే రోజుల్లో ముఖ్యమైన నియోజకవర్గాలలో జనసేన పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించనున్నారు అని తెలుస్తుంది.


జనసేన పార్టీ 2019 ఎన్నికలలో ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఇప్పటి వరకు ఏ సర్వేలో కానీ రాజకీయ విశ్లేషకులు కరెక్ట్ గా చెప్పనప్పటికీ ప్రస్తుతానికి జనసేన పార్టీకి ఉన్న బలాన్ని బట్టి ఆ పార్టీ ఒక 8 నియోజకవర్గాల్లో గెలుపు మీద తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉందని నీ కుదిరితే ఈ నియోజకవర్గాల్లో ఒక రెండిట్లో జనసేన పార్టీ అభ్యర్థులు కూడా గెలుపొందారని ప్రచారం జరుగుతుంది. తనకు అవకాశం ఉన్న ఆ 8 నియోజకవర్గాలు వరసగా విశాఖపట్నం రాజమండ్రి నర్సాపురం అమలాపురం కాకినాడ విజయవాడ గుంటూరు కర్నూలు ఈ నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఎంపీ సీట్లకు జనసేన పార్టీ నుంచి గట్టి పోటీ ఉండబోతుంది అని రాజకీయ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు అందుకున్నాయి. అసలే ఇన్ని సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఒక బలమైన సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ ఇప్పటికే విపరీతంగా ప్రభావితం చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గాల్లో బలమైన సామాజిక వర్గం వారి వల్లనే గెలుపోటములు కూడా తారుమారు అవుతాయి అని తెలుస్తుంది. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా తోట చంద్రశేఖర్ ని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు అటు చంద్రశేఖర్ కూడా ఇప్పటికే తన ప్రచారాన్ని నియోజవర్గంలో ప్రారంభించారు అని తెలుస్తుంది. ఇప్పుడే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడి ఆ పార్టీతో అన్ని రకాలుగా తెగతెంపులు చేసుకున్నారు ఆ రోజు నుంచే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఈ లోక్సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గణనీయంగా ప్రభావితం చేయగలదు అన్న వార్తలు వస్తున్నాయి అంటే జనసేన పార్టీ బలం ఏ మేరకు జరిగిందో మనం ఊహించవచ్చు అయితే ఇది దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అపర చాణిక్యుడు రాజకీయ వర్గాల్లో ఆయనకు ఉన్న తెలివితేటలు అన్నీ ఇన్నీ కావు చివరి నిమిషంలో ఆయన ఎలాంటి చక్రం తిప్పి తారుమారు చేయడానికి ఉందని అంటుంటారు కాబట్టి జనసేన పార్టీ కి ఈ నియోజకవర్గలలో గెలవడానికి అటు తెలుగుదేశం పార్టీ నుంచి ఇటు   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది అనే చెప్పుకోవాలి.

Post a Comment

0 Comments