F2 డైరెక్టర్ అనిల్ రావిపూడి కి ఉత్తరం రాసిన అభిమాని

Business

F2 డైరెక్టర్ అనిల్ రావిపూడి కి ఉత్తరం రాసిన అభిమాని

F2 డైరెక్టర్ అనిల్ రావిపూడి కి ఉత్తరం రాసిన అభిమాని




F2 సినిమాతో ఈ సంక్రాంతికి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి కి ఒక అభిమాని ఆయన సినిమా గురించి లెటర్ రాశారు సెల్ ఫోన్లు ఉన్న ఈ రోజుల్లో కూడా ఒక దర్శకుడికి అభిమాని లెటర్ రాయడం అంటే అది గొప్ప విషయమని చెప్పుకోవాలి ఇలా తనకు ఒక అభిమాని ఉత్తరం రాసిన విషయాన్ని అనిల్ రావిపూడి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. నెల్లూరు లోని బాలాజీ నగర్ లో ఉండే కొలపల్లి ఈశ్వర్ ఎఫ్ 2 సినిమా చూసి అది బాగా నచ్చడంతో ఏదైనా కొత్త పద్ధతి లో తనకు సినిమా నచ్చిన విధానాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి కి చెప్పాలని ఒక రోజు ఆంధ్ర జ్యోతి పేపర్ లో వచ్చిన అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చూసి దానిలో ఆయన ఇంటి అడ్రస్ కనుక్కుని ఈ లెటర్ రాశారు అది నిజంగానే అనిల్ రావిపూడి కి అందడంతో ఆయన చాలా సంతోష పడి ఈశ్వర్ కు థాంక్స్ చెపుతూ ట్విట్టర్ లో తనకు వచ్చిన లెటర్ ఫొటోస్ ను షేర్ చేశారు. ఇక ఎఫ్ 2 సినిమా విషయానికి వస్టే సంక్రాంతి కానుకగా విడుదల అయి అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది దాదాపుగా 100 కోట్ల గ్రాస్ కూడా రాబట్టిన ఈ సినిమా ఈ సంవత్సరం అటు నిర్మాత దిల్ రాజు కు ఇటు దర్శకుడు అనిల్ రావిపూడి కి అలాగే హీరో వెంకటేష కు మంచి విజయాన్ని అందించింది.

Post a Comment

0 Comments