dailymotion-domain-verification=dmcxvoo0ku31parka google.com, pub-7019376976432612, RESELLER # video

నాయనా రారా ఇంటికి అంటున్న శ్రీనివాస్ అవసరాల(NRI)


Avasarala Srinivas at an event




దర్శకుడు నటుడు శ్రీనివాస్ అవసరాల హీరోగా ఒక కొత్త సినిమా రాబోతుంది దాని పేరు NRI రా రా నాయనా ఇంటికి అని ఫిక్స్ చేశారు. ఈ సినిమాతో బాలు రాజశేఖర్ అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. మెగా బ్రదర్ నాగబాబు మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా పూర్తిగా వినోదభరితమైన చిత్ర మని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో ఉండే ఒక తెలుగు యువకుడి జీవితాన్ని, అతని జీవితంలో అతను ఎదుర్కొన్న కష్టాలను, సమస్యలను ఈ సినిమాలో చాలా వినోదాత్మకంగా చూపించబోతున్నామని... మాతృభూమి, మాతృభాష మీద ఉన్న మమకారాన్ని గురించి కూడా ఈ చిత్రంలో టచ్ చేయబోతున్నామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. శ్రీనివాస్ అవసరాల మొదటిగా నాని హీరోగా వచ్చిన అష్ట చమ్మ సినిమాతో తెలుగుతెరకు పరిచయమై ఆ తర్వాత తన విలక్షణమైన నటనతో, కామెడీ టైమింగ్ తో తెలుగు సినిమాల్లో మంచి పాత్రలు దక్కించుకున్నారు. దర్శకుడిగా మారి మొదట దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత నారా రోహిత్ నాగశౌర్య హీరోలుగా రెజీనా హీరోయిన్ గా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సినిమా జ్యో అచ్యుతానంద కూడా రిలీజ్ అయ్యి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మళ్లీ ఇంతవరకు అవసరాల దర్శకత్వం చేయలేదు ఆ మధ్య నానితో కానీ లేదా నాగ శౌర్య తో గానీ సినిమా ఉంటుందనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు దాని గురించి మళ్లీ ఏలాంటి వివరాలు తెలియడం లేదు.


నాయనా రారా ఇంటికి అంటున్న శ్రీనివాస్ అవసరాల(NRI) నాయనా రారా ఇంటికి అంటున్న శ్రీనివాస్ అవసరాల(NRI) Reviewed by cinemarascals on February 20, 2019 Rating: 5

No comments

rubiconproject.com, 8769, RESELLER, 0bfd66d529a55807 # video google.com, pub-7019376976432612, RESELLER # video