మోదీ బయోపిక్‌ - తొమ్మిది గెటప్స్ లో వివేక్ ఒబెరాయ్

Business

మోదీ బయోపిక్‌ - తొమ్మిది గెటప్స్ లో వివేక్ ఒబెరాయ్






వివేక్‌ ఒబెరాయ్‌ హీరోగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'పీఎం నరేంద్రమోదీ' అనే టైటిల్‌ను పెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మోదీ పాత్రలో నటిస్తున్న వివేక్‌ను విభిన్న గెటప్స్‌లో చూపిస్తూ తొమ్మిది లుక్స్‌ను విడుదల చేశారు. ఆదివారమే ఈ పోస్టర్‌ను బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా చేత విడుదల చేయించాలనుకున్నారు.






కానీ గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ మృతితో కార్యక్రమాన్ని నిలిపివేశారు. కాగాతర్వాత ఈ పోస్టర్ విడుదలయింది. ఒమంగ్‌కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలతో కలిపి దాదాపు 23 భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పాత్రలో సినీ నటుడు మనోజ్‌ జోషి నటిస్తున్నారు. ఏప్రిల్‌ 12న ఈ సినిమా విడుదల కానుంది.


















Post a Comment

0 Comments