బన్నీ నుంచి ఐదు సినిమాలు

Business

బన్నీ నుంచి ఐదు సినిమాలు






అల్లు అర్జున్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోలలో ఒకడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ టెన్ హీరోలలో ఖచ్చితంగా ఉండే హీరోలలో ఒకడు. అయితే ఎప్పుడైతే తన రెండు సినిమాలు దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాప్ అయ్యాయో అప్పటి నుంచి రేస్ లో కొంచం వెనుక పడ్డాడు. నా పేరు సూర్య తర్వాత చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్న అల్లు అర్జున్ అంత తొందరగా ఏ సినిమా ఓకె చేయలేదు. అంత పెద్ద హీరో ఏంటి ఇలా ఖాళీగా వుండడ మేంటి అని అందరూ అనుకున్నారు. కానీ మొన్నటికి మొన్న త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ చేశాడు ఆ తర్వాత వెంటనే ఇప్పుడు సుకుమార్ తో కూడా నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు.ఇవే కాకుండా మురుగుదాస్ తో ఒకటి హిందీ లో కూడా ఓ సినిమా చేస్తాడట.









ఖాళీగా ఉన్నాడు అనుకున్నారు కానీ ఒకేసారి ఇన్ని సినిమాలు చేస్తూ జనాల్ని షాక్ కి గురి చేస్తాడని ఎవరూ ఊహించని రీతిలో బన్నీ రేసు గుర్రం లా కెరీర్ ప్లాన్ చేసుకుంటాడు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే బన్నీ తన నెక్స్ట్ రెండు సినిమాలు మహేష్ బాబు కు ఫ్లాప్ ఇచ్చిన దర్శకులతో నే చేయబోతున్నాడు. మహేష్ కు నేనొక్కడినే సినిమా తో అతి పెద్ద ఫ్లాప్ ఇచ్చిన డైరక్టర్ సుకుమార్ ఇప్పుడు బన్నీతో సినిమా చేయబోతున్నారు. ఇక స్పైడర్ తో మురుగదాస్ మహేష్ కు డిజాస్టర్ ఇచ్చారు. ఆయన కూడా త్వరలో బన్నీతో సినిమా చేయబోతున్నారు. బన్నీ చేయాలని ప్లాన్ చేసుకుని ఫిక్స్ చేసుకున్న అయిదు ప్రాజెక్టుల్లో మురుగదాస్ ది, సుకుమార్ ది కూడా ఒక్కో సినిమా ఉందంట.





ఇక బన్నీ సినిమాల వరస చూస్తుంటే త్రివిక్రమ్, సుకుమార్, మురుగదాస్, విక్రమ్ కే కుమార్, ఈ నాలుగు కాక, ఓ హిందీ సినిమా బన్నీ ప్లానింగ్ లో వున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమా ప్రారంభించకుండానే సుకుమార్ సినిమాను ప్రకటించి, మహేష్ ను హర్ట్ చేశారన్న విమర్శలకు విరుగుడుగా త్వరలో మురుగదాస్ సినిమాను కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఇవన్నీ తెలుగు వరకే కానీ బన్నీ చేయబోయే బాలీవుడ్ సినిమా డిటైల్స్ మాత్రం చాలా సిక్రెట్ గా వుంచినట్లు తెలుస్తోంది.


Post a Comment

0 Comments