Featured Post

[TRENDING]

Sunday, 10 March 2019

వైసీపీలో చేరిన సినీ నటుడు ఆలీ

author photo





ప్రముఖ సినీ నటుడు ఆలీ తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నివాసం లోటస్ పాండ్ లో ఆయనను కలిసి జగన్ సమక్షంలో ఆలీ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. నిజానికి ఆలీ హీరో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరుతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆలికి ఆఫర్ వచ్చిందని ఎమ్మెల్యే సీట్ ఆఫర్ చేశారని దానిలో ఆలి చేరుతారనే పుకార్లు కూడా చాలా వరకు వచ్చాయి. సినిమాల్లో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం అతనితో ఉన్న స్నేహం వల్ల ఆలీ కచ్చితంగా జనసేన పార్టీలో చేరుతారని చాలా మంది భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది.





Ali with Pavankalyan




పవన్ కళ్యాణ్ కేవలం తనకు స్నేహితుడు మాత్రమేనని స్నేహం వేరు రాజకీయాలు వేరు అని ఆలీ మాట్లాడుతూ ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నుంచి అతని మీద పలు సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నారు. స్నేహితుని మోసం చేశాడని నమ్మక ద్రోహం చేశాడని ఆలి మీద విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం గురించి ఆలీని అడిగినప్పుడు మాత్రం అతను చాలా కూల్ గా తన గురించి పవన్ కళ్యాణ్ కి పవన్ కళ్యాణ్ గురించి తనకు బాగా తెలుసు అని తమ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తన స్నేహితుడు రాజకీయాల్లో సక్సెస్ అయితే అది తన గెలుపుగా కూడా భావిస్తానని ఆలీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మంత్రి ఇవ్వడం తన కల అని దానికోసం కష్టపడి పని చేస్తానని ఆలీ చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని జగన్ ఆదేశిస్తే తాను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడినుంచైనా పార్టీ కోసం ప్రచారం చేస్తానని ఆలీ అన్నారు.









వైయస్సార్ కాంగ్రెస్ పార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ సీఎం గా చూడాలి అన్నది తన కలగా పెట్టుకుంటానని ఆలీ చెప్పుకొచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోలు నటులు రాజకీయాలలో చాలా యాక్టివ్గా ఉండటం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కి నోటిఫికేషన్ కూడా వెలువడడంతో ఇకమీదట ఈ రాజకీయ పార్టీకి ఏ సినీ నటులు తమ మద్దతు తెలుపుతారో అలాగే ఆ పార్టీల విజయాల కోసం ప్రచారం చేస్తారు అన్నది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.


This post have 0 Comments


EmoticonEmoticon

Next article Next Post
Previous article Previous Post

Advertisement