మహేష్ బాబు సినిమా అంటే వద్దన్నాడు కారణం అదేనా??

Business

మహేష్ బాబు సినిమా అంటే వద్దన్నాడు కారణం అదేనా??






సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా గా చాలా ప్రెస్టేజియస్ గా భారీ తారాగణం తో తో దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న చిత్రం మహర్షి. ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ పూర్తయి మే 9 వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు గా ఈ సినిమా నిర్మాతలు ప్రకటించారు. అయితే మహేష్ 26 సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. సినిమాలో కొన్ని ముఖ్య పాత్రల కి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నీ అలాగే కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రను అనుకున్నట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. అయితే విజయ శాంతి ఈ పాత్ర చేయబోతుందా లేదా అన్న విషయం మీద ఇంకా ఎలాంటి క్లారిటీ రానప్పటికీ కన్నడ నటుడు ఉపేంద్ర మాత్రం తన పాత్రకి నో చెప్పారు అని తెలుస్తుంది.









ఉపేంద్ర తన కొత్త సినిమా ఐ లవ్ యు ను తెలుగు లో డబ్బింగ్ చేయించి రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన ఉపేంద్ర ఆ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ తనకు మహేష్ బాబు సినిమా నుంచి ఆఫర్ వచ్చినమాట నిజమే నని కాకపోతే తన దగ్గర డేట్స్ ఖాళీ లేకపోవడంతో దురదృష్టవశాత్తు ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది అని బాబు లాంటి సూపర్ స్టార్ తో నటించడం తనకు ఎంతో బాధగా ఉందని అన్నారు.









తెలుగులో ఇంతకుముందు అల్లు అర్జున్తో సన్నాఫ్ సత్యమూర్తి లాంటి విజయవంతమైన సినిమాల్లో నటించిన ఉపేంద్ర మళ్ళీ ఇంతవరకు తెలుగులో ఏ చిత్రం చేయలేదు. హీరోగా దర్శకునిగా తనని తాను ఇప్పటికే ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్న ఉపేంద్ర కన్నడ రాజకీయాల్లో కి కూడా అడుగు పెట్టడం జరిగింది. పోయినసారి ఆయన కన్నడ ప్రజకీయ పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. కానీ చివరికి తన పార్టీలో అందరూ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని తను స్థాపించిన పార్టీ నుంచి తనే బయటకు వచ్చి ఆ పార్టీని రద్దు చేయడం జరిగింది .


Post a Comment

0 Comments