హీరోయిన్ వేటలో రాజమౌళి

Business

హీరోయిన్ వేటలో రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో ఒక్క ఛాన్స్ దొరికితే చాలూ అనే చాలా మంది 





ఎదురుచూస్తుంటారు. అలియాభట్ లాంటి క్రేజీ, టాలెంటెడ్ హీరోయిన్లు అవకాశం ఇవ్వమని 
ప్రాధేయపడినట్టు ఇటీవల స్పష్టమైంది. అలాంటిది తాను కోరకముందే తన ముందుకు వచ్చిన ఆఫర్‌ను శ్రద్ధాకపూర్ ఎందుకు రిజెక్ట్ చేసిందనే చర్చ మొదలైంది. శ్రద్ధాకపూర్ రిజెక్ట్ చేయడం వెనుక కారణం సరైందనే మాట వినిపిస్తున్నది.

                                                 

ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న RRR సినిమాకు సంబంధించి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి మరోసారి చుక్కెదురైంది. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ నుంచి బ్రిటీష్ అందాల సుందరి డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకొన్న తర్వాత మరో హీరోయిన్ కోసం జక్కన్న వేట ప్రారంభించారు. శ్రద్ధాకపూర్, పరిణితి చోప్రా లాంటి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్న శ్రద్ధాకపూర్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఈ సినిమా ఆఫర్‌ను ఆమె తిరస్కరించినట్టు వచ్చిన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.

సున్నితంగా తిరస్కరించిన శ్రద్ధా కపూర్ 


బాలీవుడ్‌లో అత్యంత బిజీగా మారిన హీరోయిన్లలో శ్రద్ధాకపూర్ ఒకరు. సాహో చిత్రం కోసం సుదీర్ఘంగా పనిచేస్తున్నారు. పలు ప్రాజెక్టుల కోసం డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. అయితే RRR సెన్సేషనల్ ప్రాజెక్ట్ కావడం, అందుకోసం భారీగా డేట్స్ కేటాయించి రావడం ఆమెకు సమస్యగా మారినట్టు తెలిసింది. అందుకోసమే రాజమౌళి ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం.


హీరోయిన్ సీన్లు వచ్చే షెడ్యూల్‌కు RRR కథలో భాగంగా హీరోయిన్‌ది బ్రిటీష్ యువతి పాత్ర అని తెలిసింది. అందుకోసమే డైసీ ఎడ్గర్ జోన్స్‌ను రంగంలోకి దించారు. కానీ కుటుంబ కారణాలు చెప్పి ఈ సినిమాకు ముఖం చాటేసింది. విదేశీ యువతి దొరకని పక్షంలో కథలో మార్పులు చేసి ఇండియన్ హీరోయిన్‌కు అనుకూలంగా స్టోరిని మార్చే ప్రయత్నం చేస్తున్నారనే వార్త కూడా బయటకు వచ్చింది. అంతేకాకుండా ప్రస్తుత షెడ్యూల్‌లో హీరోయిన్ కన్ఫర్మ్ కాకపోతే వచ్చే షెడ్యూల్‌లో హీరోయిన్ పాత్రకు సంబంధించిన సీన్లను ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.


























































































Post a Comment

0 Comments