Featured Post

[TRENDING]

Tuesday, 16 April 2019

పిచ్చెక్కిస్తున్న సినిమా ట్రైలర్

పిచ్చెక్కిస్తున్న సినిమా ట్రైలర్
2007-2013 మధ్య జరిగిన 57 బాంబ్ బ్లాస్ట్‌ల నేపథ్యంలో రైడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్‌ గుప్తా తెరకెక్కించిన చిత్రం ఇండియాస్ మోస్ట్ వాంటెడ్. అర్జున్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్ర టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. బిన్ లాడెన్స్ స్పూర్తితో కరుడుగట్టిన ఓ ఉగ్రవాది చేసిన దారుణ ఘటనలను ఈ చిత్రం ద్వారా చూపించనున్నారు. ఇండియాస్ ఒసామా అనే పిలవబడే ఆ వ్యక్తిని మనదేశానికి చెందిన ఐదుగురు వ్యక్తులు బుల్లెట్ కూడా వాడకుండా ఎలా పట్టుకున్నారు అన్న నేపథ్యంలో సినిమా తెరకెక్కించారు. ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ ప్రభాత్‌ పాత్రను అర్జున్ కపూర్ పోషించారు. మే 24న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులలో సినిమాపై భారీ అంచనాలు పెంచింది. రాజేష్ శర్మ, ప్రశాంత్ అలెగ్జాండర్‌, గౌరవ్ మిశ్రా, ఆసిఫ్ ఖాన్, సాన్‌టిలాల్ ముఖర్జీ, బజ్‌రంగబలీ సింగ్, ప్రవీణ్ సింగ్ సిసోడియా తదితరులు చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. అమిత్ త్రివేది చిత్రానికి సంగీతం అందించారు.

Trailer This post have 0 Comments


EmoticonEmoticon

Next article Next Post
Previous article Previous Post

Advertisement