సొంత డబ్బింగ్ చెప్పుకుంటున్న బాహుబలి ప్రభాస్

Business

సొంత డబ్బింగ్ చెప్పుకుంటున్న బాహుబలి ప్రభాస్

సొంత డబ్బింగ్  చెప్పుకుంటున్న బాహుబలి ప్రభాస్ 





యూవీ క్రియేషన్స్‌ పతాకంపై తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ త్రిభాషా చిత్రం గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ మాట్లాడుతూ, ''సాహో'ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాం. మన దేశంలోని పలు భాషల్లో సినిమాని విడుదల చేయబోతున్నాం. హిందీ వెర్షన్‌ తీసేటప్పుడు డైలాగ్‌ల విషయంలో కష్టపడాల్సి వచ్చింది. నాకు హిందీ తొలి భాష కాదు. దీంతో దానిపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నా. అయితే హిందీ రాయగలను, మాట్లాడగలను, కానీ ఇంట్లో హిందీలో మాట్లాడుకోం. ఇప్పుడు 'సాహో' కోసం చాలా హోంవర్క్‌ చేస్తున్నాం, ఓ టీచర్‌ దగ్గర డైలాగ్‌ క్లాసులు తీసుకున్నా, ఇది ఫస్ట్‌ షెడ్యూల్‌లో కష్టంగా అనిపించింది. 




సాహో' తొలి షెడ్యూల్‌ కష్టంగా అనిపించింది. ముఖ్యంగా హిందీ భాష బాగా ఇబ్బంది పెట్టింది' అని ప్రభాస్‌ అన్నారు.




కానీ, రెండో షెడ్యూల్‌కి వచ్చేసరికి పర్వాలేదనిపించింది. ఇప్పుడు బాగానే మాట్లాడగలుగుతున్నా. ఈ సినిమాకి హిందీ వెర్షన్‌కి డబ్బింగ్‌ నేనే చెబుతాను' అని అన్నారు. ఈ సినిమా ఆగస్ట్‌ 15న విడుదల కానుంది. ప్రభాస్‌ దీంతోపాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.




ఆయన ప్రస్తుతం 'సాహో' చిత్రంలో నటిస్తున్నారు. సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. భారీ బడ్జెట్‌తో అత్యంత స్టయిలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తుంది.

Post a Comment

0 Comments