మన్మధుడు కు ఫ్రెంచ్ రీమేక్ కష్టాలు

Business

మన్మధుడు కు ఫ్రెంచ్ రీమేక్ కష్టాలు

మన్మధుడు కు ఫ్రెంచ్ రీమేక్ కష్టాలు 



2006లో అక్క‌డ విడుద‌లైన ప్రేతే మెయి తా మై ఆధారంగా ఇప్పుడు మ‌న్మ‌థుడు 2 క‌థ రాహుల్ రవీంద్ర‌న్ అల్లుకున్నాడని.. అక్క‌డున్న పాయింట్ త‌న సినిమాలో చూపిస్తున్నాడ‌ని తెలుస్తుంది. అక్క‌డ హీరోకు 45 ఏళ్లొచ్చినా కూడా ఇంకా పెళ్లి చేసుకోడు.. ఇంట్లో వాళ్లు కూడా పెళ్లెప్పుడు అంటూ స‌తాయిస్తుంటారు.. అలాంటి స‌మ‌యంలో ఏం చేయాలో తెలియ‌క ఓ అమ్మాయిని భార్య‌గా అద్దెకు తీసుకొస్తాడు.. కానీ కాలం గ‌డిచిన కొద్ది నిజంగానే వాళ్లిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిపోతారు.


తెలుగు ఇండ‌స్ట్రీలో ఇంచుమించు ఇలాంటి క‌థ‌తోనే చాలా సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు మ‌న్మ‌థుడు 2లో కూడా ర‌కుల్ ప్రీత్ సింగ్‌ను త‌న భార్య‌గా నాగార్జున అద్దెకు తెస్తాడ‌ని.. ఆ త‌ర్వాత క‌థ మొద‌ల‌వుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే ఇదే గానీ నిజ‌మైతే ఇది త‌మ సినిమానే అని ఫ్రెంచ్ నిర్మాత‌లు కూడా కాపీ రైట్ వేయ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఆగ‌స్ట్ 9న మ‌న్మ‌థుడు 2 విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈ చిత్రాన్ని సొంత క‌థ‌తో రాసుకున్నాడా.. లేదంటే ఫ్రెంచ్ నుంచి అరువు తెచ్చుకున్నాడా..?



ఏ సినిమా చూసినా ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం.. ఎక్క‌డ చూడు కాపీ భాగోత‌మే.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో ఇదే వినిపిస్తుంది. ఏ సినిమా చూసినా కూడా ఎక్క‌డో ఓ చోట దాని మూలాలు క‌నిపిస్తుండ‌టంతో అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. ఇప్ప‌టికే ఎన్నో సినిమాలు ప‌క్క దేశాల నుంచి ప‌ట్టుకొచ్చారు. అయితే చెప్పి తీసుకొస్తే రీమేక్ అంటారు.. చెప్పుకుండా తీస్తే ఫ్రీమేక్ అంటారు. ఇప్పుడు మ‌న్మ‌థుడు 2 విష‌యంలో రెండోది జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. అప్ప‌ట్లో అజ్ఞాత‌వాసి క‌థ చెప్ప‌కుండా త్రివిక్ర‌మ్ రీమేక్ చేసిన‌ట్లు.. ఇప్పుడు మ‌న్మ‌థుడు 2ను కూడా ఫ్రెంచ్ సినిమా నుంచి రాహుల్ రాసుకున్నాడ‌ని తెలుస్తుంది

Post a Comment

0 Comments