dailymotion-domain-verification=dmcxvoo0ku31parka google.com, pub-7019376976432612, RESELLER # video

28 ఏళ్లకు ఆ ఘనత సాధించిన నటి కీర్తి సురేష్..

28 ఏళ్లకు ఆ ఘనత సాధించిన నటి కీర్తి సురేష్..


దాదాపు 28 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాకు జాతీయ ఉత్తమ నటి దక్కింది.  తెలుగు సినిమా 'మహానటి'లో కీర్తి సురేష్ నటనకు ఈ పురస్కారం లభించింది. ఇన్నేళ్ల తర్వాత తెలుగు సినిమాకు ఈ గౌరవం  దక్కడం పట్ల సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ.. తమ సంతోషాన్ని కామెంట్స్ రూపంలో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇది అలా ఉండగా.. 1990లలో తెలుగు చిత్రసీమ లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి ‘కర్తవ్యం’ చిత్రానికిగాను ఈ అవార్డ్ వరించింది. కెరీర్ మొదట్లో ఎక్కువగా గ్లామర్ పాత్రలనే చేసిన విజయశాంతి నట జీవితం గురించి చెప్పుకుంటే ‘కర్తవ్యం’ ముందు తర్వాత అనేంతగా గొప్ప మలుపు తీసుకొందీ ఈ సినిమా.


తాజాగా 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డ్‌ల కోసం 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని సినిమాలను లెక్కలోకి తీసుకుని వీటిని ప్రకటించారు.
28 ఏళ్లకు ఆ ఘనత సాధించిన నటి కీర్తి సురేష్.. 28 ఏళ్లకు ఆ ఘనత సాధించిన నటి కీర్తి సురేష్.. Reviewed by D Wire Cutter on August 10, 2019 Rating: 5

No comments

rubiconproject.com, 8769, RESELLER, 0bfd66d529a55807 # video google.com, pub-7019376976432612, RESELLER # video