dailymotion-domain-verification=dmcxvoo0ku31parka google.com, pub-7019376976432612, RESELLER # video

ట్వీట్ చేసిన బన్నీ - అల్లు అర్జున్‌ కోసం విజయ్ కొత్త అవతారం...

  ట్వీట్ చేసిన బన్నీ - అల్లు అర్జున్‌ కోసం విజయ్ కొత్త అవతారం... 


అల్లు అర్జున్‌ కోసం విజయ్ కొత్త అవతారం... ట్వీట్ చేసిన బన్నీ..


విజయ్ దేవరకొండ అదిరిపోయే గిఫ్ట్‌తో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ఫిదా అయ్యారు. విజయ్ పంపిన ఆ గిఫ్ట్‌ను బన్నీ తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. విషయం ఏమంటే.. విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ అనే పేరుతో బట్టల వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. 

ఆ రౌడీ బ్రాండ్‌కి సంబంధించిన స్పెషల్లీ డిజైనెడ్ క్లోత్స్‌ను విజయ్, బన్నీకి బహుమతిగా పంపించాడు. అంతేకాదు ఓ లెటర్ రాసిన విజయ్.. బన్నీ అన్న ఈ బట్టలు స్పెషల్‌గా నేను డిజైన్ చేశానని పేర్కోన్నాడు. ఆ బట్టల్నీ అందుకున్న బన్నీ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ‘చెప్పిన విధంగా బట్టల్నీ పంపినందుకు ధన్యవాదాలు మై డియర్ బ్రదర్ విజయ్.. రేపు అల వైకుంఠపురంలో విజయోత్సవ వేడుకల్లో ప్రేమతో పంపిన ఈ బట్టల్నే ధరిస్తాను’ అంటూ ట్వీట్ చేశాడు బన్నీ. 

Image


అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడవ చిత్రం 'అల వైకుంఠపురంలో' సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతోంది. అల్లు అర్జున్‌కు జోడిగా పూజా హెగ్డే నటించగా.. టబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ముఖ్యమైన పాత్రల్లో సుశాంత్, నివేదా పేతురాజ్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ట్వీట్ చేసిన బన్నీ - అల్లు అర్జున్‌ కోసం విజయ్ కొత్త అవతారం...   ట్వీట్ చేసిన బన్నీ - అల్లు అర్జున్‌ కోసం విజయ్ కొత్త అవతారం... Reviewed by D Wire Cutter on January 11, 2020 Rating: 5

No comments

rubiconproject.com, 8769, RESELLER, 0bfd66d529a55807 # video google.com, pub-7019376976432612, RESELLER # video